మహిళలతో మాటామంతి 50వ రోజు

అనంతపురం, జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమంలో భాగంగా సోమవారం 50వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని స్థానిక 46వ డివిజన్ లో పర్యటించి మహిళలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో నెలకొన్న సమస్యలు తెలుసుకొని వైకాపా అవినీతి ఆగడాలను ఎండగట్టి మహిళలలో రాజకీయ చైతన్యం పెంపొందించి ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకు వారు తోడ్పడాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించిన మహిళలతో మాటామంతి కార్యక్రమం 50రోజులకు చేరుకోవడం మంచి శుభపరిణామని అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మేము ఇప్పటివరకు 33డివిజన్లు 4పంచాయితీలలో గత 50రోజులుగా తిరిగామని ఎక్కడ చూసినా నగరంలో గానీ పంచాయితీలలో గానీ ఎక్కడచుసిన అడుగడుగునా సమస్యలే ఉన్నాయి తేలికపాటి సమస్యలను కూడా ఎమ్మెల్యే మున్సిపల్ యంత్రాంగం పట్టించుకోవడం లేదు నగర ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైకాపా ప్రభుత్వం తీవ్రంగా విఫలం అయ్యింది. కనిసం నగర ప్రజలకు మంచినీరు అందించలేని స్థితిలో నగర మున్సిపల్ వ్యవస్థ ఉంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి డివిజన్ లో ప్రజలు మానసికంగా దృఢంగా ఉండడానికి ఏర్పాటు చేసి అభివృద్ధి చేసిన పార్కులు ప్రస్తుత వైకాపా ప్రభుత్వం హయాంలో సంరక్షణకు నోచుకోక మరుగున పడే పరిస్థితులు దాపురించాయి. గతంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అధికారంలోకి రావాలన్న కుతూహలంతో నోటికి వచ్చినట్లు అపద్దపు హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చి 5సంవత్సరాలు గడుస్తున్న ఏమాత్రం పట్టించుకోలేదు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం డంపింగ్ యార్డ్ తరలింపు ప్రతి ఇంటికి సుద్దజాలాలు అందేలా చుడాడం ఇలాంటి నగర ప్రజలకు ప్రధానంగా అవసరమయిన హామీలను ఇచ్చి వాటి అమలు దిశగా ఏమాత్రం అడుగులు వేయలేదు. మురుగు కాలువల వ్యవస్త అధ్వాన్న స్థితిలో ఉంది కాలువలలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు పూడిక తీయడంలో నగర పాలక సంస్థ పూర్తిగా విఫలం అయ్యిందని అంతంత మాత్రంగా తీసే పూడిక కాలువల పక్కనే వదిలివేయడంతో తిరిగి కాలువలోకి వెళ్తుందని. కేంద్రం నిధులతో అంతంత మాత్రంగానే అభివృద్ధి పనులు చేసి తామే చేశామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని నగర కార్పొరేషన్ నిధులను నగర అభివృద్ధికి వెచ్చించ కుండా మేయర్ ఎమ్మెల్యే కు కొమ్ము కాస్తూ అవినీతికి పాల్పడుతూ ఆ నిధులు మొత్తం కాజేస్తున్నారని మేము అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అవినీతిని మున్సిపాలిటిలో జరిగిన అవినీతి మొత్తం లెక్కలతో సహా కక్కిస్తామని. పేరుకే జగనన్న గృహాలు అని అవి లబ్ధిదారులకు ఏమాత్రం అందలేదని అందిన అరకొర అధికారం పూర్తికావస్తున్నా పునాది దశలోనే ఉన్నాయని వైకాపా ప్రభుత్వ పాలన కాలంలో పేదల సొంతింటి కళ కలగానే మిగిలిపోతుందని వైకాపా ప్రభుత్వ పాలన కాలంలో అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు దినసరి కూలీలు, చిరు వ్యాపారస్తులు, పారిశ్రామిక వేత్తలు ఇలా అందరూ ఇబ్బందులకు గురవుతున్నారని మహిళలపై దాడులు కూడా పెరిగిపోయాయని ప్రజలు ఈ విషయాలన్నీ గమనించి ఉమ్మడి ప్రభుత్వ స్తామనకు తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.