మీతో మీ కార్పొరేటర్ 58 వ రోజు

విశాఖ దక్షిణ నియోజకవర్గం, అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో శుక్రవారం మీతో మీ కార్పొరేటర్ (సమస్యలపై కలసి పోరాడదాం) అనే కార్యక్రమంలో భాగంగా యాభై ఎనిమిదివ రోజుకి 3009 ఇల్లులు సర్వే చేయడం జరిగింది. మిరపకాయ వీది వెంకటేశ్వర మెట్ట, బృందావన్ జంక్షన్ 33వ వార్డు ప్రాంతంలో ప్రతి ఇంటింటికి వెళ్లి వారి యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం దక్షిణ నియోజకవర్గం నాయకులు గోపికృష్ణ(జికె) పరివేక్షణ నిర్వహించబడింది. నాతో పాటు జనసైనికులు, వీరమహిళలు వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని దక్షిణ నియోజకవర్గం జివిఎంసి ఫ్లోర్ లీడర్ జనసేన పార్టీ 33వ వార్డ్ కార్పొరేటర్ భీశెట్టి వసంతలక్ష్మి అన్నారు.