మీతో మీ కార్పొరేటర్ 64 వ రోజు

విశాఖ, అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో శుక్రవారం మీతో మీ కార్పొరేటర్ సమస్యలపై కలసి పోరాడదాం అనే కార్యక్రమంలో భాగంగా అరవై నాలుగువ రోజుకి సాయిబాబా స్ట్రీట్ , 33వ వార్డు ప్రాంతంలో ప్రతి ఇంటింటికి వెళ్లి వారి యొక్క సమస్యలు తెలుసుకొని.. 3897 ఇల్లులు సర్వే చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం దక్షిణ నియోజకవర్గం నాయకులు గోపికృష్ణ(జికె) పర్యవేక్షణలో నిర్వహించబడింది. నాతో పాటు జనసైనికులు, వీరమహిళలు వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని దక్షిణ నియోజకవర్గం జివిఎంసి ఫ్లోర్ లీడర్ జనసేన పార్టీ 33వ వార్డ్ కార్పొరేటర్ భీశెట్టి వసంతలక్ష్మి అన్నారు.