జనసేన జనజాగృతి యాత్ర 68వ రోజు

  • గురుదత్ ఆధ్వర్యంలో రాజానగరం నియోజకవర్గంలో మజ్జిగ పంపిణి కార్యక్రమం
  • దిగ్విజయంగా ముందుకు సాగుతుంది
  • ఉదయాన్నే.. మల్లంపూడి గ్రామ ఉపాధి హామీ రైతుకూలిలతో ముఖాముఖి కార్యక్రమంలో “గురుదత్”

రాజానగరం నియోజకవర్గం: జనసేన జనజాగృతి యాత్ర 68వ రోజు కార్యక్రమంలో భాగంగా రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, మల్లంపూడి గ్రామ ఉపాధి హామీ పని చేస్తున్న రైతుకూలిలను ఉదయాన్నే స్వయంగా వారి దగ్గరకి రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత శ్రీ మేడ గురుదత్ ప్రసాద్ వెళ్లి వారి వారి గ్రామంలో ఉన్న సమస్యలు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రైతులకు చేసిన మేలుగురించి వివరించారు. కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో 200 మంది ఉపాధి హామీ రైతుకూలిలకు మేడ గురుదత్ ప్రసాద్ మజ్జిగ పంపిణి చేసారు. ఈ కార్యక్రమం రాజానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, రాజానగరం మండలం జనసేన పార్టీ కో-కన్వీనర్ నాగవరపు భాను శంకర్, కొబ్బరికాయల రాంబాబు, బాసు సుబ్రహ్మణ్యం, మెంబెర్ శ్రీను, బాసు నూకరాజు, జనసేన పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.