మార్కాపురం జిల్లా చేయాలని జెఏసి ఆధ్వర్యంలో జరిగిన 6వ రోజు నిరాహారదీక్ష

పశ్చిమ ప్రకాశం ప్రాంతంలోని మార్కాపురం జిల్లా చేయాలని కోరుతూ మార్కాపురం టౌన్ స్ధానిక ఆర్డిఓ కార్యాలయం ఎదురుగా జెఏసి ఆధ్వర్యంలో 6వ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ వారిచే చేపట్టిన నిరాహార దీక్షకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేసిన జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్, జిల్లా సాధన సమితి వైస్ చైర్మెన్ ఇమ్మడి కాశీనాధ్, తెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్, జిల్లా సాధన సమితి చైర్మెన్ కందుల నారాయణరెడ్డి, జిల్లా సాధన సమితి కన్వీనర్ సైదా, సి.పి.ఐ నాయకులు అందే నాసరయ్య, కాశిం, సి.పి.యం నాయకులు డి.కె.యం.రఫీ. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, శిరిగిరి శ్రీను, రత్న కుమార్, జానకి రామ్, జనసేన కార్యకర్తలు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.