మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయం నందు 73వ గణతంత్ర దినోత్సవం వేడుకలు

మచిలీపట్నం, జనసేన పార్టీ కార్యాలయం నందు ఇంచార్జ్ బండి రామకృష్ణ సారధ్యంలో ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం కార్పొరేషన్ నందు జనసేన పార్టీ నాలుగో డివిజన్ కార్పొరేటర్ నాగ ఛాయాదేవి చే జాతీయ పతాకం గౌరవ వందనం జరిగింది. అనంతరం మచిలీపట్నం టౌన్ ఉపాధ్యక్షుడు ఎండి సమీర్ గారి జన్మదినం సందర్భంగా పార్టీ కార్యాలయం నందు జిల్లా ఉపాధ్యక్షులు పంపు గడవల చౌదరి మరియు వివిధ డివిజన్ల ఇన్చార్జులు రూరల్ నాయకులు సమక్షంలో కేక్ కటింగ్ జరిగినది.