పెదయాదార పంచాయతీలో 73వ గణతంత్ర వేడుకలు

కృష్ణ జిల్లా, మచిలీపట్టణం రూరల్, 73వ గణతంత్ర వేడుకలు పెదయాదార పంచాయతీలో కరోనా నిబంధనల నడుమ స్థానిక మచిలీపట్టణం రూరల్ లో జనసేన పార్టీ మండల అద్యక్షులు, పెదయాదార సర్పంచ్ గళ్ళా తిమోతి చీఫ్ గెస్ట్ స్థానిక పాఠశాల నందు అట్టహాసంగా జరిగాయి ఈ సందర్భంగా తిమోతి మాట్లాడుతూ విద్యార్ధులు గురువులు చెప్పే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అర్ధం చేసుకుని మన రాజ్యాగం ద్వారా సంక్రమించిన హక్కుల పట్ల అవగాహన పెంచుకోవాలని, మన దేశం యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పే విధంగా మసులు కోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మిఠాయిలు, ఆటవస్తువులు పంచాయతి తరపున పంచి ఏ విధమయిన సహాయం కావాలన్న తెలియజేయాలని ప్రధాన ఉపాధ్యాయులకును కోరారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బావిశెట్టి వాసు పవన్, వార్డ్ మెంబెర్స్ కే కంచర్లపల్లి సీతయ్య, విక్కుర్తి నాగలక్ష్మి, కొత్తపల్లి మహాలక్ష్మి, గ్రామస్థులు ముళ్ళపూడి సుబ్బారావు, విద్యాకమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు విద్యార్థుల తలిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.