శ్రీనివాసరావుతోటలో స్వర్గీయ వంగవీటి మోహనరంగా 75వ జయంతి మహోత్సవాలు

గుంటూరు, స్వర్గీయ వంగవీటి మోహనరంగా 75 వ జయంతి మహోత్సవాలు శ్రీనివాసరావుతోటలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అచ్చయ్యడాబా సెంటర్ లోని రంగా విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కులమతాలకు అతీతంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉండానంటూ రంగా అండగా నిలిచేవాడని దళిత నేత కొర్రపాటి నాగేశ్వరరావు అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై తన జీవితాన్ని అంకిత చేసిన గొప్ప నాయకుడు రంగా అని జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో మైనారిటీ నాయకులు షర్ఫుద్దీన్, యూసుఫ్, రామిశెట్టి శ్రీను, కోనేటి ప్రసాద్, దాసరి రాము, శేషు, అంజి, సుబ్బారావు, చిన్నా, తోట సాంబశివరావు, తిరుపతిరావు, తేజ తదితరులు పాల్గొన్నారు.