రేగులపాడు గ్రామంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

పార్వతీపురం, మన్యం జిల్లా రేగులపాడు గ్రామంలో సోమవారం కస్తూరుబా హైస్కూల్ ఆవరణలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సోమవారం స్వాతంత్ర దినోత్సవ సందర్బంగా కస్తూర్భా హైస్కూల్ టీచర్స్ మాట్లాడుతూ, దేశం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాల ఫలితంగా పోరాట సమరయోధులు ఎంతోమంది అమర వీరుల త్యాగాలు కారణంగానే బ్రిటీష్ పాలకులపై తిరుగులేని విజయం సాధించారు అంటూ
మన స్వాతంత్ర్య దినోత్సవం. సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని భరతజాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన రోజు ఈరోజని చెప్పడం జరిగింది. ఈ యొక్క వేడుకులకు కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయరాలు అందరితో పాటుగా, యస్ ఓ రోజా మేడం, గ్రామ సర్పంచ్ మెరుగుల భవాని, చంద్ర మౌళీశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ తమరాపు చిన్నారావు, రేగులపాడు స్థానిక యువ నాయకులు గేదెల ధనుంజయ రావు, బొడ్లపాడు వజ్రగడ రవికుమార్(జానీ) హాజరవడం జరిగింది.