తెలుగురాష్ట్రాల మధ్య 8 ప్రత్యేక రైళ్లు

ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా రైల్వేశాఖ దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలోనే దసరా, దీపావళి పండగ సీజన్ షురూ కావడంతో  39 అదనపు ప్రత్యేక రైళ్లకు జోన్లను రైల్వే బోర్డు అనుమతించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో నాలుగు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైళ్లు ప్రధాన నగరాల గుండా రాకపోకలు సాగించనున్నాయి.

ఇదిలా ఉంటే ప్రయాణీకుల సౌకర్యార్ధం దసరా, దీపావళి పండగలను దృష్టిలో పెట్టుకుని 8 కొత్త రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 13 నుంచి పట్టాలెక్కించనుంది. ప్రస్తుతం ఉన్న రైళ్లతో పాటు.. ఈ స్పెషల్ ట్రైన్స్ కూడా తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణీకులకు సేవలందించనున్నాయి. 13న సికింద్రాబాద్- షాలిమార్, 14న షాలిమార్-సికింద్రాబాద్, 15న విశాఖ-తిరుపతి, 17న సికింద్రాబాద్-విశాఖ, 18న విశాఖ-సికింద్రాబాద్, 25న కాకినాడ-లింగంపల్లి, 26న లింగంపల్లి-కాకినాడ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ రైళ్లతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు కాస్త ఊరట లభిస్తుందని చెప్పవచ్చు.