జనసేన జన జాగృతి యాత్ర 92వ రోజు

  • గురుదత్ కు అడుగడుగునా జననీరాజనం పట్టిన కూనవరం గ్రామ ప్రజలు
  • జనసేన పార్టీ బలం జనసైనికులే.. గురుదత్

రాజానగరం నియోజకవర్గం: జనసేన జనజాగృతి యాత్ర 92వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం సీతానగరం మండలం, కూనవరం గ్రామంలో ఆదివారం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా 600 గాజు గ్లాసులు పంపిణి చెయ్యటం జరిగింది. నేటి వరకూ నియోజకవర్గం మొత్తంగా 56,000 వేల గాజు గ్లాసులు పలు గ్రామాల్లో ఇవ్వటం జరిగింది. జనసేన జన జాగృతి యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ &ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ అధ్యక్షతన దిగ్విజయంగా ముందుకు సాగుతూ రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ జండా ఎగరేసే విధంగా ముందుకు సాగిపోతుంది. గ్రామ గ్రామన ప్రతి ఇంటింకి వెళ్లి జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం కరపత్రాలను ప్రజలకు అందిస్తూ… జనసేన పార్టీని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.. ఈ సందర్భంగా గురుదత్ మాట్లాడుతూ అధికారం పార్టీ నాయకులకు ప్రతీక పత్రిక ముఖంగా కొన్ని విన్నపలు చెయ్యటం జరిగింది. అవి ముఖ్యంగా కూనవరం గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు, వీధి దీపాలు లేవు, మంచినీటి సమస్య.. ఈ సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, లేదంటే జనసేన పార్టీ తరఫునుంచి పోరాటం చేయడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్, రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కోరుకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఐ టీ కోఆర్డినేటర్ వెంటపాటి రామకృష్ణ, రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ వీరమహిళ కందికట్ల అరుణ కుమారి, చదువు ముక్తేశ్వరరావు, తన్నీరు తాతాజీ, అడపా అంజి బాబు, మెడిద వీరబాబు గారు, పేదిశెట్టి రమేష్, కూనవరం జనసేన పార్టీ నాయకులు గేదల సత్తిబాబు, చిక్కాల నాగశ్రీను, శ్రీను, అయ్యప్ప, మురళి, వీరమహిళలు మరియు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.