పోలవరంలో జనం కోసం జనసేన 93వ రోజు

పోలవరం: కొయ్యలగూడెం మండలం, పొంగుటూరు గ్రామంలో మండల అధ్యక్షులు తోట రవి మరియు గ్రామ అధ్యక్షులు గేలం భాస్కర్ ఆధ్వర్యంలో 93వ రోజు జనం కోసం జనసేన కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి చిర్రి బాలరాజు గారికి జనసేన పార్టీ కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడుతూ అవసరాలు వారి యొక్క సమస్యలు తెలుసుకుంటూ అందరినీ కలుపుకుంటూ మేనిఫెస్టో వివరిస్తూ ముందుకు సాగారు. పొంగుటూరులో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కనీసం ఒక్క అధికారికి పట్టడం లేదని, ఎప్పటినుంచో పొంగుటూరు రోడ్డు సమస్యను తీర్చమని ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా, అధికారులు అధికార నాయకులు కనీసం పట్టించుకోని స్థితిలో ఉన్నారని, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక వర్షాకాలంలో మరెన్నో ఇబ్బందులు పడుతూ అనేక రకాలైన వ్యాధులకు గురవుతున్నారని, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల కూటమిలో అధికారంలోకి రాగానే ప్రజా సమస్యలు తీర్చే లక్ష్యంగా పనిచేస్తామని, ఒక్క అవకాశం ఇవ్వాలని, అధికారంలో లేకుండానే నాలుగేళ్లలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని అధికారం వస్తే ఇంకా ఎన్నో చేసి చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగడ రమేష్, ప్రగడ సురేష్, అడపా సుబ్బారావు, పసుపులేటి రామారావు, చోడిపిండి సుబ్రహ్మణ్యం, పసుపులేటి రాజు, ప్రగాఢ రాజు, కంకిపాటి వంశీ, ఆగడం లక్ష్మణ్ దొర, మద్దాల శ్రీను, మంచిమి నాగార్జున మండల కమిటీ మరియు గ్రామ కమిటీ నాయకులు కార్యకర్తలు, వీరమహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.