పోలవరంలో జనం కోసం జనసేన 97వ రోజు

పోలవరం నియోజకవర్గం: పోలవరం మండలం, ఎల్ ఎన్ డి పేట గ్రామంలో జనం కోసం జనసేన 97వ రోజు కార్యక్రమం మండల అధ్యక్షులు గునపర్తి చిన్ని ఆధ్వర్యంలో శనివారం పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి చిర్రి బాలరాజు ప్రజల్లోకి వెళ్తూ ప్రతి ఇంట్లో వారి యొక్క సమస్యలు తెలుసుకుంటూ జనసేన టిడిపి ఉమ్మడి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తాము చేసే అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ.. నమ్మించి మోసం చేసిన ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు బుద్ధి చెప్పాలని, విలువైన ఓటును డబ్బుకు అమ్ముకోవద్దని, ఆలోచించి ఓటు వేయాలని, ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఉమ్మడి మేనిఫెస్టోను గ్రామస్థులకు వివరించారు. బాబు జగజ్జివన్ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కొయ్యలగూడెం టౌన్ అధ్యక్షులు మాదేపల్లి శ్రీను, కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ తెలగం శెట్టి రాము, కూరసం రమేష్, నరసారాపు నాగేంద్ర, ప్రసాద్, కొక్కెర సత్తిబాబు, మామిడిపల్లి స్వాతి, మీడతా సురేష్, ప్రేమ్ కుమార్, పోసి, శీలం వంశీ, నరసింహ మూర్తి, కట్టా నరేష్, చిక్కాల శ్రీను, టీడీపీ నాయకులు గుబ్బ రాంబాబు, ఇళ్ల సత్యనారాయణ, సత్తిబాబు పాల్గొన్నారు.