జనసేన కార్యకర్తల ఆత్మీయ పలకరింపు 9వ రోజు

  • పెన్షన్లు ప్రభుత్వ పథకాలు అకారణంగా ఎత్తివేస్తున్నారు..
  • చెత్త సేకరించే బండ్లు రెండు వారాలకు ఒకసారి వస్తున్నాయి..

గాంధీనగర్ నెల్లూరు రూరల్ లో జనసైనికుల అభిమానాలు మరువలేము.. అంటూ జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ గత ఎనిమిది రోజులుగా జనసేన కార్యకర్తల ఆత్మీయ పలకరింపులో భాగంగా శనివారం స్థానిక 29వ డివిజన్ నందు ఖలీల్ బాయ్ ని కలిసి వారి కుటుంబ సభ్యుల మద్దతు కోరుతూ ఇరుగుపొరుగు వారిని జనసేన పార్టీకి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీని ముందుండి నడిపిన గాంధీనగర్ వాసులకు అభినందనలు. చెత్త సేకరించే బండ్లు రెండు వారాలకు ఒకసారి వస్తున్నాయి, డ్రైనేజి కాలవలు వ్యర్ధాలతో పొంగి పొర్లుతున్నాయి ప్రజాధనంతో నిర్మించిన పార్కు నిర్వహణ లోపంతో పాడుబడిపోతుంది. ఒక్కసారి ప్రభుత్వ పధకాలు ఎత్తి వేస్తే ఎన్ని అర్హత పత్రాలు చూపినా మల్లీ తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు. వైసిపి వైఫల్యాల గురైన ప్రజలు ఆలోచించి ఈ సారి మూడవ ప్రత్యామ్యానికి అవకాశం ఇవ్వాలని జనసేన పార్టీ గాజు గ్లాసుకి అవకాశం ఇస్తే జనసేన నాయకులు అభివృద్ధి పథంలో నడిపించగలరని పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకు పని చేసే మా నాయకులు ప్రజలకు సుపరిపాలన అందిస్తారని తెలిపారు. 29వ డివిజన్లో జరిగిన ఈ డోర్ టు డోర్ కాంపిటీన్ లో కిషోర్ తో పాటు ఖలీల్ భాయ్, నారాయణ, భాను, ఇంతియాజ్, ప్రశాంత్ గౌడ్, ప్రసన్న, హేమచంద్ర యాదవ్, అలేక్, మౌనిష్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు..