సీతానగరం గ్రామంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన “బత్తుల”

రాజానగరం: ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, వడగాల్పులు వలన ఇబ్బందులకు గురి అవుతున్న ఉపాధి హామీ కూలీలకు మరియు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధి హామో కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమాన్ని సీతానగరం గ్రామంలో సీతానగరం ఆర్టిసి కాంప్లెక్స్ వద్ద రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ప్రారంబించారు. అనంతరం పొలాల్లో పనులకు వెళ్లిన కూలిలను కలిసి వారితో ముచ్చటించి ఎప్పుడు ఏ కష్టం వచ్చిన మీకు ఎల్లపుడూ జనసేన పార్టీ తోడుగా అండగా ఉంటుంది అని తెలియజేసి అందరికీ మజ్జిగ పాకెట్స్ అందచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మట్టా వెంకటేశ్వరావు, కిమిడి శ్రీరామ్, మెట్ల యేసుపాదం, గెడ్డం కృష్ణ, నాగారపు సత్తిబాబు, వీరామహిళ తోకాడ సత్యవతి, వణువు లక్ష్మి, ప్రశాంత్ చౌదరి, దాసరి రమేష్, నాతిపాం దొరబాబు, చీకట్లను వీర్రాజు, కొండేటి సత్యనారాయణ, కవల గంగారావు, మట్టా సుబ్రహ్మణ్యం, వంగలం అభిరామ్ నాయుడు ఇతర నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.