రాజానగరంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన “బత్తుల”

రాజానగరం: ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, వడగాల్పులు వలన ఇబ్బందులకు గురి అవుతున్న ఉపాధి హామీ కూలీలకు మరియు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధి హామి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమాన్ని రాజానగరం గ్రామంలో రాజానగరం ఆర్టిసి కాంప్లెక్స్ వద్ద కార్యక్రమాన్ని రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ప్రారంభించారు. అనంతరం రాజానగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు, విద్యార్థులకు, వృద్దులకు అందరికీ మజ్జిగ పాకెట్స్ అందచేశారు. బత్తుల బలరామకృష్ణ దంపతులు చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.