వాటర్ డిస్పెన్సెర్ ను ప్రారంభించిన జియ్యని శ్రీధర్

విశాఖపట్నం, సీతమ్మధార మండల రెవెన్యూ ఆఫీస్ నందు, ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ ప్రెసిడెంట్ శివ్ వడ్లమూడి ప్రజల వినియోగార్ధం అందించిన బ్లూ స్టార్ వాటర్ డిస్పెన్సెర్ (హాట్ & కోల్డ్) విశాఖ నగర డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యం.ఆర్.ఓ. పేర్లి శ్యామ్ ప్రసాద్, డిప్యూటీ తహశీల్దార్ చేతన్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవికృష్ణ, వైజాగ్ బ్లడ్ డోనర్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీమతి రాజకుమారి, ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ సెక్రెటరీ బావిశెట్టి కిరణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బి.వి.రాఘవ శ్రీనివాస్, ప్రతినిధులు రవితేజ, రౌతు బాలాజీ, జాయింట్ సెక్రెటరీ వీరేశ్వర రావు, కొండేటి భాస్కర్, ఎస్.గిరి, ట్రెజరర్ జోగీంద్రనాధ్ సాయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యం.ఆర్.ఓ.శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ ప్రెసిడెంట్ శివ్ వడ్లమూడి ని, సెక్రెటరీ బావిశెట్టి కిరణ్ ను అభినందించారు. వాటర్ డిస్పెన్సెర్ అందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.