రాజధాని లో చలి పంజా.. రోజు రోజుకు కనిష్ఠ స్థాయికి చేరుతున్న ఉష్ణోగ్రతలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో రెండు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. రెండు రోజుల క్రితం వరకు 19 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవ్వగా ఆదివారం 16.4 డిగ్రీలకు చేరింది. ఒక్కసారిగా 2.5 ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో చలి గాలుల తీవ్రత అధికమవుతోంది. దాంతో చలి పంజా విసురుతోంది. ఉదయం వేళల్లో రహదారులను మంచు కప్పేయడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరో రెండు, మూడురోజుల వరకు పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశముంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

శివారుల్లో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు..

గ్రేటర్‌ శివారు ప్రాంతాల్లో చలితీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. ఆదివారం రామచంద్రాపురంలో అత్యల్పంగా 12.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాజేంద్రనగర్‌లో 12.5, ఉప్పల్‌ – 13.1, అల్వాల్‌ -13.7, బేగంపేట -14.1, కుత్బుల్లాపూర్‌ – 14.4, ఎల్‌బీనగర్‌లో 14.8, చందానగర్‌ – 14.9, గాజుల రామారం – 15.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.