జనసేన పార్టీ బలోపేతానికి కృషిచేసిన కోలా ప్రసాద్ సేవలు చిరస్మరణీయం..

  • కోలా ద్వితీయ వర్ధంతి కార్యక్రమంలో పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శేషు కుమారి..

పిఠాపురం: జనసేన పార్టీ ఆవిర్భావం నుండి క్రియాశీలక బాధ్యతలు స్వీకరించి జనసేన పార్టీని బలోపేతం చేయడంలో విశేష సేవలు అందించిన జనసేన టౌన్ ప్రెసిడెంట్ దివంగత కోలా రాజేంద్రప్రసాద్ సేవలు చిరస్మరణీయమని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషు కుమారి పేర్కొన్నారు. గత సంవత్సరంలో కరోనా కారణంగా కోలా రాజేంద్ర ప్రసాద్ మరణం జనసేన పార్టీకి తీరనిలోటని అన్నారు. ఆయన సేవలకు స్ఫూర్తిగా ఆయన ద్వితీయ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని పిఠాపురం టౌన్ జనసేన పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం అభినందనీయమని శేషు కుమారి తెలిపారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కుమారి మాట్లాడుతూ కోలా రాజేంద్రప్రసాద్ మరణంతో జనసేన పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్న వారిలో రాజేంద్రప్రసాద్ మొదటి స్థానంలో ఉంటారు అన్నారు. ఆయన ఆశయానికి అనుగుణంగా జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతామని తెలిపారు. రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ కార్యకర్తలు అండగా ఉంటామని శేషు కుమారి భరోసా కల్పించారు. పిఠాపురం టౌన్ ఉప్పాడ బస్టాండ్ వద్ద టౌన్ ప్రెసిడెంట్ బుర్రా సూర్య ప్రకాష్ రావు, కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి మాకినీడి శేషుకుమారి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. టౌన్ మహిళా ప్రెసిడెంట్ కోలా దర్గ మాట్లాడుతూ తన భర్త ప్రసాద్ ను స్మరించుకుంటూ కార్యక్రమం విజయవతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ బుర్రా సూర్య ప్రకాష్ రావు, టౌన్ మహిళా ప్రెసిడెంట్ కోలా దుర్గ, గౌరవ అధ్యక్షులు కర్రి కాశీ విశ్వనాథ్, జ్యోతుల శ్రీనివాస్, పెద్దిరెడ్డి భీమేశ్వరరావు, కసిరెడ్డి నాగేశ్వరరావు, వేల్పుల చక్రధర్, బొజ్జా కుమార్, గరగ బాబి, అల్లం కిషోర్ పిట్టా చిన్న, పబ్బినిడి దుర్గాప్రసాద్, నామ శ్రీకాంత్, మేళం రామకృష్ణ, ఖండవల్లి సూర్యకుమారి, మనోహర్, మండల ప్రెసిడెంట్ లు అమరాది వల్లి రామకృష్ణ, వినుకొండ శిరీష, గోపు సురేష్, వినుకొండ అమ్మాజీ, దొడ్డి దుర్గాప్రసాద్, గొల్లపల్లి గంగ, వెలుగుల లక్ష్మణ్, పూర్ణ, మరియు పిఠాపురం టౌన్ కమిటీ సభ్యులు, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.