ఐతవరం గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం, ఐతవరం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఎండ తీవ్రత వల్ల రోడ్డున పోయే బాటసారులకు ఆకుల వంశి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో 65వ జాతీయ నేషనల్ హైవే రోడ్డుపైన రెండు వందల ఇరవై లీటర్ల మజ్జిగని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందిగామ మండల అధ్యక్షులు కుడుపుగంటి రామారావు, చందర్లపాడు మండల అధ్యక్షులు వడ్డేల్లి సుధాకర్, నందిగామ జనసేన నియోజకవర్గం నాయకులు సూర సత్యనారాయణ, కర్రి రమేష్, రామ్ రెడ్డి వెంకటేశ్వరరావు, చలమాల సాయి, పెసరమల్లి తిరుపతిరావు, చలమాల వెంకటేశ్వర్లు, నాయుడు అఖిల్, బత్తుల నాగబాబు, రామిరెడ్డి గోపికృష్ణ, కాసాని అనిల్ కుమార్ పాల్గొన్నారు.