ధ్వంసమైన జెండా దిమ్మెను సందర్శించిన గాదె

సత్తెనపల్లి పట్టణంలో 7వ వార్డులో అన్ని అనుమతులు తీసుకొని జనసేన పార్టీ జెండా దిమ్మెను అన్ని హంగులతో ఆవిష్కరించనున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు జనసేన పార్టీ జెండా దిమ్మెను ధ్వంసం చేసిన విషయం అందరికీ విదితమే. విషయం తెలుసుకున్న ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు శుక్రవారం సత్తెనపల్లి పట్టణంలో రిజిస్టర్ ఆఫీస్ పక్కన ఉన్న జెండా దిమ్మెను పగలగొట్టిన ప్రదేశాన్ని సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. రాజకీయాలంటే ఏదైనా పాలసీల మీద, ఏదైనా ఇష్యూ గురించి మాట్లాడుకోవడం ఉండేది తర్వాత అందరం బాయ్ బాయ్ అనుకునే పరిస్థితిలో ఉండేవి రాజకీయాల్లో. కానీ 2019 నుంచి ఈ రాజకీయాలు అంటే ఏదో ఒక గ్రూపు తగాదాలు లాగా, ముఠా తగాదాలు లాగా మనుషుల్ని మనుషుల్ని చంపుకునే విధానం లాగా కొనసాగుతుంది. సత్తెనపల్లి నడిబొడ్డున యధేచ్చగా ఒక పార్టీ జెండాను ధ్వంసం చేస్తుంటే అసలు ఈ ప్రజాస్వామ్యం అనేది ఉందా..? రాజకీయాల్లో ఎవరి జెండాలను వాళ్ళు ఎగరేసుకునే విధానం ఉంటుంది కానీ ఈ సత్తెనపల్లిలో అంబటి జెండా ఒక్కటే ఎగరవేయాలనే విధంగా కొనసాగుతోంది. రిజిస్టర్ ఆఫీస్ పక్కన ఉన్న జెండా దిమ్మెను ఎవరైతే ధ్వంసం చేశారో వారిని చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు చూసి పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము అని తెలియజేశారు. మీరు సత్తెనపల్లిలో ఒక జెండా దిమ్మెను పగలగొడితే పదుల సంఖ్యలో జెండా దిమ్మెలు నిర్మిస్తామని వచ్చే వారంలో జనసేన పార్టీ దిమ్మెను సత్తెనపల్లి నడిబొడ్డులో ఎగరవేస్తామని చెప్పారు. అదేవిధంగా సత్తెనపల్లి జనసేన పార్టీలో ఎటువంటి గ్రూపులు లేవని సత్తెనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉందని తెలియజేశారు.