రైస్ మిల్లర్ల దోపిడీ నుండి రైతును కాపాడండి: చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి

హుస్నాబాద్: చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి. రైతు కంట కన్నీరు తుడుస్తాను అని గొప్పలు చెప్పుడు కాదు దొరా..! ముందు మీ సహచరులు రైస్ మిల్లర్ల దోపిడీ నుండి రైతును కాపాడండి అని తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పంట తరువాత మీకు కమిషన్ల కోసం రైతును మోసం చేస్తూనే ఉన్నారు దళారులు. ప్రతి గింజ కొంటాము అన్నారు. కానీ క్వింటాలుకు 11కిలోలు దోచుకుంటున్నాం అని కూడా చెప్పి చెయ్యండి. మాకు కూడా అమ్మే ముందే మీ నిజస్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళము అవుతాము. ఉచితాల వల్ల ఏమి కోల్పోతున్నాం అనేది తెలుస్తుంది. ఇంతకు ముందు వానాకాలం పంటలో 271 రూపాయలు, ఇప్పుడు ఏకంగా 603 రూపాయలు మీ స్నేహితులు అయిన మిల్లర్లు మీరు కలిసి దోచుకుంటున్నారు. ఇక మిమ్ములను మార్చే రోజు వచ్చింది దొరా..! రైతుల భూములు లాక్కొని పూర్తి పరిష్కారాలు చూడరు, రైతు భందు పేరిట ఏటా ఏకరాకు 10000 రెండు దఫాలు ఇస్తున్నాం అని చెప్పే మీరు అంతకు ముందు ఉన్న రైతుకు సంబందించిన అన్ని సబ్సిడీలు ఎత్తేశారు. పాపం రైతులు అమాయకంగా మోసపోతున్నారు నీ మాయ మాటలు నమ్మి. రైతుల పక్షాన ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లో 3 గంటలు కూర్చోబెట్టి పంపుతున్నారు. అంటే మిమ్మల్ని అడిగితే అరెస్టులు చేయిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి, ప్రశ్నిస్తే జైలుకే చట్టాన్ని ఇంత బలంగా మా మీద ప్రయోగిస్తున్నారు. మోసం చేస్తున్న ప్రభుత్వం మీద కేసు వెయ్యాలి స్వీకరిస్తుందా ఈ పోలీస్ వ్యవస్థ? న్యాయవ్యవస్థ అని ప్రభుత్వంపై చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.