నాడు-నేడు కార్యక్రమం క్షేత్రస్థాయి పరిశీలన

కాకినాడ సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు కార్యక్రమం క్షేత్రస్థాయి పరిశీలన శనివారం అట్ల సత్యన్నారాయణ మరియు దారపు సతీష్ ఆధ్వర్యంలో 33వ డివిజన్, చిన్న మార్కెట్ ప్రాంతంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ ఈ ప్రాంతంలోని శ్రీరామ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. అక్కడున్న స్థానికులు శశిధర్ తో మాట్లాడుతూ ఈ స్కూలులో గతంలో 5వ తరగతి వరకు ఉండేదని, నేడు దానిని 2వ తరగతి వరకు పరిమితం చేసి మిగిలిన క్లాసులను తీసివేసారని వాపోయారు. దీనిపై ముత్తా శశిధర్ స్పందిస్తూ గత కొన్ని రోజులుగా తాను జనసైనికులు కలిసి రాష్ట్ర ప్రభుత్వ నాడు-నేడు కార్యక్రమం పరిశీలన చేపడుతున్నామని, అసలు వై.సి.పి ప్రభుత్వానికి పాలన వచ్చా చేత కాదా అని అనిపిస్తోందనీ, ఎక్కడన్నా ఎక్కువ తరగతులు ఉన్న పాఠశాలలో తమ పిల్లలను చదివించడానికి జాయిన్ చేస్తే కొన్నేళ్ళపాటు చూసుkOnaక్కర్లేదని తల్లితండ్రులు భావిస్తారనీ, ఇక్కడ కేవలం రెండు తరగతుల కోసం తమ పిల్లలని ఎలా జాయిన్ చేస్తారని, ఇలా చేయడంవల్ల క్రమంగా విద్యార్ధుల సంఖ్య తగ్గిపోతే ఏకంగా స్కూలుని మూసివేసి ఆ స్థలాన్ని తమకు అనుకూలంగా వాడుకోవచ్చన్న వై.సి.పి దుర్భుద్ధిని తీవ్రంగా నిరశించారు. అధ్వాన్న పాలనలో ఆస్కార్ అవార్డు ఈ వై.సి.పి ప్రభుత్వానికి ఇవ్వచ్చని హేళన చేసారు. ఏరంగాన్ని చూసినా ఈ ప్రభుత్వ పాలనలో ముందుకు వెళ్ళుతున్న సూచనలు, పరిస్థితులు కనపడటంలేదని ప్రజలు ఈసడించుకుంటున్నారన్నారు. మరల ఈ స్కూలులో 5వ తరగతి వరకు పెంచాలన్న స్థానికుల వినతిపత్రాన్ని స్వీకరించారు. జనసేన పార్టీ దీనిని తీవ్రంగా ఖండిస్తోందని స్థానిక విద్యార్ధుల తల్లితండ్రుల తరపున ఉద్యమిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ సిటి అధ్యక్షుడు సంగిశెట్టి అశోక్, రాష్ట్ర సమ్యుక్త కార్యదార్శి వాశిరెడ్డి శివ, జిల్లా సెక్రెటరీ అట్ల సత్యనారాయణ, జిల్లా సమ్యుక్త కార్యదర్శి బడే క్రిష్ణ, సిటీ వైస్ ప్రెసిడెంట్ అడబాల సత్యనారాయణ, సిటి ఆర్గనైజింగ్ శెక్రటరీ మడ్డు విజయ్ కుమార్, మాజీ కార్పోరేటర్ ర్యాలీ రాంబాబు, సిటి నాయకులు జాడా రాజు, హైమవతి, రవిశంకర్, ఎస్.కె. షమ్మీర్, వార్డు అధ్యక్షులు శ్రీమన్నారాయణ, ఆకుల శ్రీనివాస్, మనోహర్ గుప్తా, నాయకులు మొసా ఏసేబు, పచ్చిపాల మధు, అగ్రహారపు సతీష్, నరసిమ్హ కుమార్, భగవాన్, చీకట్ల వాసు, కాష్మోర్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.