సీతానగరం మండల, గ్రామస్థాయి నాయకులతో బత్తుల బలరామకృష్ణ ముఖాముఖి

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలంలో గల నాయకులకు కార్యకర్తలకు, వీరమహిళలకు, జనసైనికుల అపార్ధాలు, అపోహలు, అభద్రతాభావాలు, అధికార పార్టీ ఒత్తిడితో వారి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలు, క్షేత్రస్థాయి సమస్యలు, ప్రభుత్వం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, స్థానిక అధికార పార్టీ నాయకుల బెదిరింపులు, సంక్షేమ పథకాలు ఇవ్వడంలో అధికార పార్టీ పెడుతున్న ఇబ్బందులు, త్రాగునీరు, సాగునీరు సమస్యలు మరియు వివిధ విషయాలపై ముఖాముఖి చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బత్తుల బలరామకృష్ణ మండల జనసేన శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణ, ఎలక్షన్ చేయడంలో ముందస్తు జాగ్రత్తలు, అధికార పార్టీ వారి వేధింపులు ఎల్లప్పుడూ పూర్తి స్థాయిలో ఉంటానని త్వరలో మంచి ప్రణాళికలను మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మనకు తెలియచేస్తారు దాని ప్రకారం మన నియోజకవర్గంలో తు.చా తప్పకుండా పాటించి రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీనీ అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం అని తెలియచేశారు. అంతే కాకుండా నావల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు తెలియచేస్తే దానిని సరిచేయడం కానీ క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మేడిశెట్టి శివరాం, కిమిడి శ్రీరామ్, వేగిశెట్టి రాజు, నాతిపాము దొరబాబు, మట్టా వెంకటేశ్వరావు, నాగరపు సత్తిబాబు, మద్దాల యేసుపాదం, కొండేటి సత్యనారాయణ, చీకట్ల వీర్రాజు, గల్లా రంగా, గెడ్డం కృష్ణయ్య చౌదరి, పెంటపాటి శివ, కరటపు బంగారం, దూలం బ్రహ్మం, రుద్రం నాగు, వీరామహిళ ఓనం వెంకటలక్ష్మి, ఆళ్ళపాటి ఎల్లరి కుమార్, ఎరుబండి ఈశ్వరరావు, షేక్ బాష, మాదారపు వీరభద్రరావు, మాదారపు నానీ, కిలాడీ ఎర్రయ్య, మాదారపు కోటేశ్వరరావు, పంపరపోయిన బాబ్జి, తన్నీరు రాజేంద్ర, తన్నీరు సురేష్, నందే శ్రీనుబాబు, బోల్లేపల్లి అన్నవరం, ముడిసి అంబేద్కర్, వరద వంశీ, దూలం అనిల్, గట్టి మణిపవన్, దాసరి రమేష్, బొబ్బిరెడ్డి సూరిబాబు, మామిడాల సుబ్రహ్మణ్యం, రంగుల అభిరాంనాయుడు, కవల వెంకటేష్, కవల సురేష్, ఉమ్మడిశెట్టి సురేష్, చిక్కాల సన్నీ, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.