పోలింగ్ నిర్వహణపై నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశము

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండల కేంద్రంలో పోలింగ్ నిర్వహణపై నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశము నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ అవసరం ఆవశ్యకం ఉందని, గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలబెడతామని, ఒకసారి పవన్ కళ్యాణ్ కు అవకాశం ఇవ్వండి, సంవత్సరంలోపే 255 గ్రామాలను ఆదర్శ గ్రామాలు చేస్తామని అలా చేయకపోతే నేను నా నాయకత్వం రాజీనామా చేస్తామని నియోజకవర్గ ప్రజలకు జనసేన ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశంలో కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షులు లోకనాథం నాయుడు, జిల్లా కార్యదర్శిలు భాను ప్రసాద్, రాఘవ, వెంకటేష్, ఎస్సార్ పురం అధ్యక్షులు చిరంజీవి, పెనుమూరు మండల అధ్యక్షులు శ్రీనివాసులు, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్ కుమార్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు హరీశ్వర్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిలు సురేష్ నాయుడు, రాజారత్నం నాయుడు, నియోజకవర్గ భూత్ కన్వీనర్ ధర్మ తేజ, వెదురుకుప్పం మండల బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, కార్వేటినగరం మండల బూత్ కన్వీనర్ అన్నామలై, గంగాధర నెల్లూరు మండల బూత్ కన్వీనర్ నవీన్ రెడ్డి, నియోజకవర్గ యువజన అధ్యక్షులు మహేష్ రాయల్, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, ఎస్ఆర్ పురం యువజన అధ్యక్షులు బాలరాజు, వెదురుకుప్పం మండల యువజన అధ్యక్షులు సతీష్, నగరం టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, ప్రధాన కార్యదర్శి మనీ, కార్యదర్శి మీనా, కార్వేటినగరం మండల కార్యదర్శి సోమశేఖర్ పాల్గొన్నారు.