జనసైనికుల మనోభావాలు దెబ్బతీసే ఫ్లెక్సీలను తొలగించాలి: గునుకుల కిషోర్

నెల్లూరు: జనసైనికుల మనోభావాలు దెబ్బతీసేటట్లు ఏర్పరచిన ప్లెక్సీలు తీయించాల్సిందిగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు చదలవాడ రాజేష్ తో నెల్లూరు కమిషనర్ ను, నగర మరియు రూరల్ డిఎస్పీ, జిల్లా ఎస్పీ లను కోరటం జరిగింది. అధికారుల సానుకూలంగా స్పందించి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సమస్యపై కమీషనర్ సానుకూలంగా స్పందించి సచివాలయాల పరిధిలో ఉన్న ఫ్లెక్సీలు ఫోటోలు తొలగింపుకై పంపవలసిందిగా సచివాలయ సిబ్బందిని కోరారు. వీలైనంత వరకు సోమవారం సాయంత్రం లోపల అన్ని ఫ్లెక్సీలను తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మహమ్మద్ బీన్ తుగ్లక్ మల్లీ పుట్టాడా అనిపిస్తుంది.. ఈ పరిపాలన చూస్తుంటే పాపం పసివాడు తరాలు మారిపోయినా రాజరికం ?ముగిసి పోయింది అని తెలుసుకోలేకపోతున్నాడు. ఆ రోజుల్లో పదిమంది మంచి గురించి ఆలోచించకుండా కేవలం సొంతానికి ఆలోచించి పతనం అయిపోయిన ఆ రాజు గారిని చూసి అయినా తెలుసుకోలేక పోయారు. తనను తాను హెచ్చించుకోవడం ఎలా అని తప్పిస్తే వేరే ఆలోచన లేకుండా పోయింది, ఏమి చేస్తే రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచించడం మానేసి ఫ్లెక్సీలు కట్టుకుంటూ పిచ్చి చేష్టలు చేస్తున్నారు. అధికారులు వారి నిర్ణయానికి కొమ్ము కాస్తున్నారు. ఒక అధికారి చూస్తే మనోభావ వ్యక్తికరణం ప్రజాస్వామ్యంలో ఒక భాగం మీరు కూడా కట్టుకోండి అన్నారు. తీరా కట్టడానికి పోతే మరొక అధికారి వచ్చి ఇది కమిషనర్ పర్మిషన్ తీసుకోవాలి, అని చెప్తున్నారు పోనీ కట్టినవాటికి పర్మిషన్లు చూపించలేకపోతున్నారు. పర్మిషన్లు పరిశీలించే పరిధి మీది కానప్పుడు మా ఫ్లెక్సీలు పర్మిషన్లు ఎందుకు అడుగుతున్నారంటే జవాబు లేదు. కేవలం పబ్లిసిటీ కి పరిమితమైంది ఈ వైసీపీ ప్రభుత్వం శాంతిభద్రతలు కాపాడాల్సిన అధికారులు కూడా చూస్తూ మిన్నకున్న పరిస్థితి. గత మూడు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు గురించి ఆందోళన చేస్తున్న అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇక స్థానిక నాయకులు పెత్తందారులు ఆయన నిర్ణయాలకు మడుగులు ఒత్తుతున్నారు.పిచ్చి పిచ్చి నిర్ణయాలతో పార్టీ పరువు పోతుందని తెలిసినా కావాలని పల్లకిలో మోస్తున్నారు. పేద ప్రజల గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి లేదు నిజంగా చిత్తశుద్ధి పేదల మీద ప్రేమ ఉంటే ఎప్పుడో కట్టిన హౌస్ ఫర్ ఇల్లు ఇప్పటిదాకా ఎందుకు పంచలేదు. షాదీ తోఫా ఇస్తానని అనేక రకమైన షరతులు పెట్టి వందలో ఇద్దరికి కూడా రాకుండా చేశారు. దళితులకు అందాల్సిన లోన్లు అయితే వారు వాటిపై ఆశలు వదులుకున్న పరిస్థితి. ఇక విచ్చలవిడిగా పేద వర్గానికి చెందిన భూములు దొంగ ఇసుక గ్రావెల్ అక్రమ రవాణా తోతల మనకులవుతూ వచ్చిన డబ్బును ఏం చేయాలో తెలియక ఇలా ఫ్లెక్సీలు కట్టే పరిస్థితి అని తెలిపారు.