పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: రామ శ్రీనివాస్

రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల వ్యాప్తంగా సోమవారం సాయంత్రం వచ్చిన గాలి వాన బీభత్సంగా రావడంతో సుండుపల్లి మండలంలో సుండుపల్లి గ్రామపంచాయితీ, తిమ్మసముద్రం గ్రామపంచాయితీ, తదితర గ్రామాలలో మండల వ్యాప్తంగా విపరీతమైన పంట నష్టం జరిగింది. జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ అక్కడ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి రిత్యా వచ్చిన గాలికి ఎన్నో మామిడి చెట్లు నేల రాలాయి, చేతికి అందివచ్చిన పంట నోటి వరకూ రాకుండా రైతులకు అపారమైన నష్టం జరిగింది.
కావున ప్రతి ఒక్క రైతును ఆదుకోవాలని వారికి జరిగిన నష్ట పరిహారం చెల్లించాలని, సంభంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించి వారికి జరిగిన నష్ట పరిహారం అంచనా వేసి ప్రభుత్వం తరపున చెల్లించాలని జనసేన తరపున డిమాండ్ చేశారు. అదేవిధంగా నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం తరపున నష్టాన్ని అంచనా వేసి ఎకరాకు 30,000 వేలు నుండి 40,000 వేలు వరకు నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు, గ్రామపెద్దలు, స్థానిక గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.