భూమా అఖిలప్రియ అరెస్ట్..

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిల ప్రియను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, అఖిల ప్రియను ఆమె సొంత కారులోనే హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. కాగా, అఖిలప్రియ భర్త భార్గవ రామ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.