శ్రీ గంగానమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న చిర్రి బాలరాజు

కొయ్యలగూడెం మండలం, పొంగుటూరు గ్రామంలో శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో మంద్వలా అధ్యక్షులు తోట రవి మరియు గ్రామ అధ్యక్షులు గేలం భాస్కర్ ఆహ్వానం మేరకు కార్యక్రమంలో ఆదివారం పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి చిర్రి బాలరాజు పాల్గొనడం జరిగింది. 15 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర మహోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, అమ్మవారి దయ ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని, ఐశ్యర్య ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పాదం కృష్ణ, కొయ్యలగూడెం టౌన్ అధ్యక్షులు మాదేపల్లి శ్రీను, జీలుగుమిల్లి మండల అధ్యక్షులు పసుపులేటి రాము, చోడిపిండి సుబ్రహ్మణ్యం, ప్రగడ రమేష్, ప్రగడ సురేష్, వామిశెట్టి నాని, ప్రకాష్, ఏపూరి సతీష్ జనసైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు.