గ్రామ గ్రామాన జనసేన పార్టీ జెండా ఎగరేస్తాం: గాదె

ప్రతిపాడు నియోజకవర్గం: పెదనందిపాడు మండలంలో కొప్పర్రు మరియు వరగాని గ్రామాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు చేతుల మీదుగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇరు గ్రామ ప్రజలు జనసేన పార్టీ నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు. జెండా ఆవిష్కరణ అనంతరం గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాబోయేది జనసేన ప్రభుత్వం అని, జనసేన పార్టీ రోజురోజుకీ బలపడుతుందని, అందుకు గ్రామ గ్రామాన ఎగురుతున్న జనసేన పార్టీ జెండాలు నిదర్శనమని తెలియజేశారు. త్వరలో పవన్ కళ్యాణ్ గారి ప్రారంభించబోయే వారాహి యాత్రతో రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు సంభవిస్తాయని, రాబోయే జనసేన ప్రభుత్వం ద్వారా ప్రజారంజక పరిపాలన అందిస్తామని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన పెదనందిపాడు మండల నాయకులను, ఇరు గ్రామ నాయకులను జనసైనికులను అభినందించారు. అలాగే రాబోయే రోజుల్లో ప్రజలకు అండగా ఉండి జనసేన పార్టీ అభివృద్ధి కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు రత్తయ్య, జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాథ్, జిల్లా నాయకులు కొర్రపాటి నాగేశ్వరావు, గుంటూరు నగర కార్యదర్శి పావులూరు కోటేశ్వరావు, పెదనందిపాడు మండల అధ్యక్షులు కొల్లా గోపి, వరగాని గ్రామ అధ్యక్షులు ఒబ్బినేని శ్రీనివాసరావు, మండల కార్యదర్శులు అందె గోపి, లలిత్ కుమార్, జనసేన పార్టీ నాయకులు హుస్సేన్, బందలపాటి సాంబశివరావు, మధులాల్, శిఖాబాలు, దామరచర్ల రామాంజి, గోపి శెట్టి సాయి,మండల నాయకులు ఆముదాలపల్లి నరేంద్ర, గూడపాటి రాంబాబు మరియు తదితరులు పాల్గొన్నారు.