చీకటి జీఓలతో వారాహి యాత్రను ఆపలేరు: బత్తుల

  • వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరణ
  • వారాహి విజయవంతానికై మహాచండీ యాగం
  • వారాహి యాత్రలో నియోజకవర్గం నుండి ప్రతిరోజు పదివేలకు పైగా పాల్గొంటారు

రాజానగరం, రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆదివారం కోరుకొండ జనసేన కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 14 వ తేదీ నుండి జనసేన వారాహి యాత్ర ప్రారంభం కాబోతుందని, ఈ యాత్రను విజయవంతం చేసేందుకు జనసేన శ్రేణులు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. సెక్షన్ 30 అడ్డుపెట్టుకుని వారాహి యాత్రను ఆపాలని చూస్తున్నారని కాని ఆపే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని తెలిపారు. శాంతియుతంగా ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైసిపి కుయుక్తులతో వారాహి యాత్రను ఆపాలని చూస్తున్నారని కాని ఎన్ని విధాల ప్రయత్నించినా మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వారాహి యాత్రను పూర్తి చేస్తారని అన్నారు. ఈ యాత్రకు లక్షలాదిగా స్వతంత్రంగా ప్రజలు వస్తారని యాత్ర దెబ్బ వైసిపి అబ్బ అనేలా ఉంటుందని అన్నారు. అరచేతితో సూర్యుడిని ఆఆపలేరని అలానె వారాహిని ఆపడం కూడా ఎవరి వల్లా కాదని అన్నారు. ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా జనసైనికులు ఉప్పెనాలా వస్తారని అన్నారు. ఐఏఎస్ మరియు ఐపిఎస్ లు కూడా వారికి వంత పాడుతున్నారని కాని నిజానికి వారికి తప్పక ఆ విధంగా చేయాల్సి వస్తుందని అర్ధమవుతుందన్నారు. వచేడి రక్త బీజుని అంతం చేసిన అమ్మవారి రథమని ఎవరైనా అడ్డువస్తే మీదనుండి ఎక్కించేస్తుందని అన్నారు. జనసేన ముసుగులో ఉన్న వైసిపి నాయకులు ముసుగు తొలగించుకుని వెళ్ళకపోతే ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. సాక్ష్యాత్తూ సిఎం జగన్ వచ్చి అడ్డుగా నిలబడినా కూడా వారాహి ఆగదని, దౌర్జన్య మరియు దోపిడీ పరిపాలనను అంతం చేసి స్వచ్చమైన పరిపాలన అందించాలని వస్తున్న పవనుడిని జనసేన శ్రేణులను ఆపేవాడే లేడని అన్నారు. వారాహి యాత్రలో రాజానగరం నియోజకవర్గం నుండి ప్రతిరోజు పదివేలకు పైగా జనసైనికులు వీరమహిళలు పాల్గొంటారని తెలిపారు. అనంతరం రాజానగరం జనసేన నాయకురాలు మరియు నాసేన కోసం నావంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకట లక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభం కాబోయే వారాహి యాత్ర అన్నవరం నుండి నర్సాపురం వరకు సాగుతుందని దనిని ఎవరూ ఆపలేరని అన్నారు. వినాశ కాలే విపరీత బుద్ధి అన్నట్లుగా వైసిపి సెక్షన్ 30 అమలు చేస్తుందని అన్నారు. మంచి పరిపాలన అందించాలని వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎవరు ఆపలేరని తెలిపారు. రాజానగరంలో ప్రతీ ఇంటిలో ఇద్దరు జనసైనికులు ఉన్నారని వారిలో ఖచిచితంగా ఒక్కరు ఈ యాత్రలో పాల్గొంటారని తెలిపారు. జనసేనాని ప్రజలలోకి రాకపోతే రాలేదని నిందలు వేస్తారు వస్తే భయపడతారని తెలిపారు. ఈ యాత్రలో రాజానగరం నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొంటారని తెలిపారు.

  • వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

పత్రికాసమావేశాం అనంతరం రాజానగరం జనసేన నాయ్కులు బత్తుల బలరామకృష్ణ మరియు వారి సతీమణి శ్రీమతి వెంకటలక్ష్మి కలిసి వారాహియాత్ర పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ప్రజాశ్రేయస్సు కోరే వారాహి యాత్రను విజయవంతం చేయాలని, అవినీతి, అరాచక పాలనను అంతమొందించే వారాహి యాత్రను విజయవంత చేయాలని నినాదాలు చేసారు.

  • వారాహి విజయవంతానికై మహాచండీ యాగం

ఈ నెల 14 వ తేదీ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన జనసేన వారాహి యాత్ర విజయవంతం కావాలని గాదరాడ గ్రామంలో ఉన్న ఓం శివశక్తి పీఠంలో సోమవారం గణపతి హోమం, రుద్రహోమం మరియు మహాచండీ హోమాలను జరిపిస్తున్నామని అందరూ విచ్చేసి విజయవంతం చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.