ఆప్తా కన్వెన్షన్ 2023 గ్రాండ్ సక్సెస్ కావాలి

కావలి: అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఏ.పి.టి.ఏ) అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు కొట్టే విజయ భాస్కర్ ఆహ్వానము మేరకు నెల్లూరు బలిజ సంఘ ఆధ్వర్యములో జరిగిన సభలో సోమవారం వారిని నెల్లూరు మినర్వా గ్రాండ్ హోటల్ లో జనసేన కావలి నియోజకవర్గ ఇంఛార్జి అళహరి సుధాకర్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఆలా శ్రీనాథ్ మర్యాదపూర్వకంగా కలవడము జరిగింది. ఈ సందర్భంగా వారు సెప్టెంబర్ 1-3 వరకు అమెరికాలో జరిగే 15వ సంవత్సర ఆప్తా కన్వెన్షన్ 2023కి తప్పక హాజరు కావాల్సిందిగా కొరడము జరిగింది. అళహరి సుధాకర్ తప్పక హాజరు అవుతాను అని తెలపడం జరిగింది. ఆప్తా అధ్యక్షులు ఈ మధ్యనే హైదరాబాద్ లో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, శ్రీ చిరంజీవి గారిని స్వయంగా కలిసి ఆప్తా కన్వెన్షన్ 2023కి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అళహరి సుధాకర్ వీరి 15వ ఆప్తా కన్వెన్షన్ 2023 గ్రాండ్ సక్సెస్ కావాలని మనస్సు పూర్తిగా కోరడమైనది.