విద్యార్దులకు జె.వి.డి కిట్లు పంపిణీ చెసిన దల్లి గోవింద్ రెడ్డి

గాజువాక నియోజకవర్గం: 64వ వార్డు కార్పొరేటర్ మరియు జనసేన పార్టీ జివిఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దల్లి గోవింద్ రెడ్డి గొడ్డువాణిపాలెం, గంగవరం హైస్కూల్లో జె.వి.డి కిట్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని పిల్లలందరికీ తన చేతుల మీదగా దగ్గరుండి కిట్లు పంపిణీ చేయడం జరిగింది. గౌరవ కార్పొరేటర్ పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మంచిగా చదువుకొని, తల్లిదండ్రులతో పాటుగా స్కూలుకి మంచి పేరు తెచ్చిపెట్టి, పిల్లలందరూ కూడా మంచి స్థాయిలో ఉండాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మాజీ అధికార ప్రతినిధి చోడిపెళ్లి ముసలయ్య, మరియు స్కూల్ హెచ్.ఎం స్కూల్ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.