వారాహి యాత్ర విజయవంతం కోసం కెనడా జనసేన ఆత్మీయ సమావేశం

  • వారాహి యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతోంది

కెనడా: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జూన్ 14న తలపెట్టిన “జనంలోకి జనసేనాని”, “వారాహి యాత్ర” విజయవంతం కావాలని వాంకోవర్ నగరం ఎన్.అర్.ఐ జనసైనికులతో హాలండ్ పార్క్, సర్రే లో సమాలోచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కుటుంబసభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయవలసినదిగా వారి బంధువులకు వీడియో సందేశాల ద్వారా తెలియ పరిచారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, వారాహి యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతోందని తెలిపారు. ఉచితాల పేరుతో పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి అభివృద్ధిని అందని ద్రాక్షగా చేసిన ప్రస్తుత ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు. ఈ సమా వేశంలో సభ్యులు బాల విశ్వనాధ్ గుద్డేటి, జనార్ధన్ గోనా, క్రాంతి, సారథి, మరియ లక్ష్మణ్ పాల్గొన్నారు. కాగా ఈశ్వర్ నందునూరి వీడియో సందేశం ద్వారా విక్టోరియా నగరం నుండి మద్ధతు తెలిపారు.