విప్లవ తార చేగువేరా

బానిస సంకెళ్లను తెంచే ఆలోచనలకు భౌగోళిక హద్దులుండవు.. విశ్వ మానవుడిగా నీవు మారితే సమస్త మానవాళి ఆక్రందనలు నీకు వినిపిస్తాయి అంటారు క్యూబా విప్లవ యోధుడు చేగువేరా. అర్జెంటీనా దేశంలో పుట్టి, క్యూబా దేశంలో బానిసత్వపు నీడలో మగ్గిపోతున్న పీడిత ప్రజల పక్షాన గెరిల్లా పోరాటం చేసి, తుదకు బొలీవియా పోరాటంలో వీర మరణం పొందిన చేగువేరా స్ఫూర్తి సదా స్ఫూర్తిదాయకమని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటలో శ్లాఘించారు. ఆయనలోని యోధుడిని నేను ప్రత్యేకంగా అభిమానిస్తాను. చేగువేరా జయంతి అయిన నేడు, జనసేన వారాహి విజయ యాత్రను మొదలుపెట్టడం యాధృచికం. ప్రజా పోరాటాల్లో జనసేన పార్టీకి ఆ విప్లవ యోధుడి తెగువే స్ఫూర్తి. జయంతి సందర్బంగా చేగువేరాకు నా తరఫున, జనసేన పార్టీ పక్షాన విప్లవ నివాళులర్పిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.