వారాహి సభను విజయవంతం చేయండి..

కాకినాడ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహ యాత్ర విజయవంతం కావాలని 3వ రోజు కాకినాడ టౌన్ లో జనసేన నాయకులు గాదె వెంకటేశ్వరరావు, కాకినాడ నగర అధ్యక్షులు సింగిశెట్టి అశోక్ ఏర్పాటుచేసిన భానుగుడి సెంటర్లో ఉన్న శివాలయంలో పూజా కార్యక్రమాలు చేసి, అనంతరం 108 కొబ్బరికాయల సమర్పణ జరిపి, అనంతరం పల్లెకారుల వీధుల్లో గడప, గడపకు వెళ్లి రేపు జూన్ 17,18 తేదీలలో పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఉంటారని, భానుగుడి సెంటర్లో వారాహి సభ ఉంటుందని దానికి ప్రజలందరూ తరలిరావాలని కోరడం జరిగింది..