పేర్నీ.. ప్రెస్ మీట్ లు పెట్టడం తప్ప నువ్వు పీకేది ఏమీ లేదు

పెడన నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రకు వచ్చిన అశేష స్పందనను చూసి తట్టుకోలేక వైసీపీ నేత పేర్ని నాని పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్.వి.బాబు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ.. వైసిపి పెద్ద ముత్తయిదు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ లు పెట్టడం తప్ప బందరుకు చేసిన అభివృద్ధి శూన్యం. పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర ప్రారంభంతో వైసీపీ నాయకులకు వణుకు మొదలైంది. మొదటి సభ తోనే తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనాలు మొదలయ్యాయి. మొదటి విడత యాత్ర ముగిసేటప్పటికీ మీ పరిస్థితిని తలచుకుంటే జాలేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపిస్తే అది ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం. అదే తమరు చెప్పులు చూపిస్తుంటే ఇవి మంచి బ్రాండ్ కొనుక్కోండి అన్నట్టుంది. తొందర పడకు పేర్ని 2024 తర్వాత నువ్వు చేసేదేమీ లేదు తీరుగ్గా నీ బొచ్చు నువ్వే పీకుతుంది. కాపులు గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా నీకు లేదు పేర్ని. మీ యజమాని కాపులకు సంవత్సరానికి 2000 కోట్లు ఇస్తానని నమ్మబలికి ఓట్లు దండుకుని కాపులను మోసం చేసినప్పుడు తమరు ఎక్కడున్నారు. కాపు కార్పొరేషన్ నిధులు అడిగే దమ్ము నీకుందా?. ఏ రోజైనా నలుగురు కాపులను పిలిచి కనీసం భోజనం పెట్టావా? నువ్వా కులం గురించి మాట్లాడేది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అనంతరం తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ తో రెడీగా ప్రెస్ మీట్ పెట్టడం కాదు. గతంలో మీ యజమాని ఇచ్చిన ఏ హామీ మీరు నెరవేర్చలేదు. సిపిఎస్ ను రద్దు చేశారా?. సంపూర్ణం నిషేధం మద్యపానం చేశారా?. కేంద్రం మెడల వంచి ప్రత్యేక హోదా తెచ్చారా?. జాబ్ క్యాలెండర్ విడుదల చేశారా?. పోలవరం పూర్తి చేయగలరా?. తూతూ మంత్రంగా ప్రారంభించిన మచిలీపట్నం పోర్టు నిర్మాణం జరిగెనా?. కడప ఉక్కు కర్మాగారం ప్రారంభిస్తారా?.పై ప్రశ్నలకు సమాధానం చెప్పి అప్పుడు ప్రెస్ మీట్ పెట్టు. నిజంగా మీకు 175 స్థానాలు గెలిచే సత్తా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడవడం ఎందుకు?. పవన్ కళ్యాణ్ గారు ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకెందుకు?. మచిలీపట్నంలో బాబాయ్, అబ్బాయి బంధం కొనసాగిస్తూ చీకటి రాజకీయాలు చేస్తూ నువ్వు కలిపే పులిహారలో పసుపు గురించి తెలుసులే. సొంత పార్టీలోనే ఎవరితో పెట్టుకోకూడదొ వారితో పెట్టుకుని పరువు పోగొట్టుకున్న పేర్ని, పవన్ కళ్యాణ్ గారిపై లేనిపోని ఆరోపణలు చేసి తమ యజమాని దగ్గర మంచి మార్కులు కొట్టే ప్రయత్నం చేశాడు. ప్రసన్నం చేసుకోవడం, పాలేరుతనం చేయటం మీకు కొత్త కాదనుకో. అధికారంలో లేనప్పుడు మచిలీపట్నానికి పోర్టు తెస్తానని దొంగ దీక్షలు చేసి ఎమ్మెల్యే అయ్యావు. తర్వాత మంత్రి అయ్యావు ఇప్పుడు మాజీ మంత్రి అయ్యావు. రాబోయే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే అవుతావు అది భవిష్యత్తు. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు మచిలీపట్నానికి ఏం చేశావో సమాధానం చెప్పే దమ్ము ధైర్యం నీకు లేదు. ఎన్నికల సమీపిస్తున్న వేళ పట్టుమంటూ ఆరు నెలల సమయం కూడ లేని పరిస్థితుల్లో కంటి తుడుపు చర్యగా పోర్టు ప్రారంభమంటూ హడావిడి చేశారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, మచిలీపట్నం పోర్టు గురించి బహిరంగ చర్చకు సిద్ధమా?. మచిలీపట్నం బస్టాండ్ బాగు చేయలేని బతుకులు మీవి, నీలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యాఖ్యానించడం సిగ్గుచేటు. బుద్ధాల పాలెం, పొట్లపాలెం, పోతేపల్లి పరిసర ప్రాంతాల్లో విపరీతంగా అక్రమ మైనింగ్ చేస్తున్న మట్టి దొంగవి నువ్వు. మీరు మీ అనుచరుగణం ఓ ప్రేమ జంటను బెదిరించిన మాట వాస్తవం కాదా?. విరామం లేకుండా 365 రోజులు రాజకీయాలు చేసి మచిలీపట్నానికి నువ్వు ఊడపొడిచింది ఏమిటి?. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ప్రెస్ మీట్ లు పెట్టడం తప్ప దేనికి పనికిరావు అని మచిలీపట్నం ప్రజలకు బాగా తెలుసు. మీరు చేస్తున్న దుర్మార్గాలను ప్రజలు పవన్ కళ్యాణ్ గారు వివరించడాని చూసి తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోని విమర్శలు చేస్తున్నావు. కన్నతల్లె మీ నాయకుడి మీద నమ్మకం లేక రాజీనామా చేసి తప్పుకుంది. తోబుట్టువు రాష్ట్రానికి విడిచి వెళ్ళింది. రేపు అధికారం పోతే విశ్వాసంలో కుక్కని, పెద్ద పాలేరుని అన్న నీలాంటి వాళ్లు కూడా పార్టీని వదిలి పారిపోతారు. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన లక్షలాది మంది జనసైనికులు, కోట్లాదిమంది ప్రజలు విశ్వసిస్తున్నారు. అది నాయకత్వం అంటే, అదే క్రెడిబిలిటీ అంటే. నువ్వు, నీ నాయకుడు, నీ పార్టీ 100 జన్మలెత్తిన పవన్ కళ్యాణ్ గారి స్థాయికి చేరుకోలేరు. సంధి ప్రేలాపాలను కట్టిపెట్టి, నీ రాజకీయ భవిష్యత్తుపై దృష్టి పెట్టు. చివరిగా వారాహికి (పవన్ కళ్యాణ్ గారి ప్రసార రథం) లారీకి తేడా తెలియకుండా నువ్వు రవాణా శాఖ మంత్రి ఎలా చేసావో అర్థం కావడం లేదని ఎస్.వి.బాబు ఎద్దేవా చేసారు.