మంచి నీటి పైప్ లైన్ల లీకేజీ సమస్యపై జనసేన వినతి పత్రం
గుంతకల్లు నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్వర్యంలో గుంతకల్లులోని కసాపురం రోడ్ నందు మంచి నీటి పైప్ లైన్లు లీకేజీ సమస్యను మున్సిపల్ ఇంజనీర్ ఈశ్వరయ్యకి అనంతపూర్ జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గుంతకల్లు నియోజకవర్గం నాయకులు అరికేరి జీవన్ కుమార్ మున్సిపల్ ఇంజనీర్ తో నియోజకవర్గంలోని ప్రజలు మంచి నీటి సమస్య వల్ల అనేక రకాల ఇబ్బందులకు గురి అవుతున్నారు అని, ఇలాంటి లీకేజిలు జరగడం వల్ల ఇంకా ఇబ్బందులకు గురవుతారు మరియు గుంతకల్లు లో మంచి నీటి సమస్యలు తీర్చక పోతే గుంతకల్లు జనసేన పార్టీ రోడ్లు పైకి వచ్చి పోరాడుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 1వ వార్డ్ జనసేన పార్టీ అభ్యర్థి హెన్రీ పాల్(ఎల్ ఎల్ బి), జనసేన పార్టీ మైనారిటీ నాయకులు జిలన్ భాష, ఫిరోజ్, జనసేన పార్టీ నాయకులు ఆర్ సీ సురేష్ (ఎల్ ఎల్ బి), తాడిపత్రి మహేష్ కుమార్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-17-at-14.00.32-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-17-at-14.00.31-1024x461.jpeg)