ప్రశ్నించడం మన ప్రథమ హక్కు: చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి

హుస్నాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి పండుగ. నిజం మాత్రం ప్రతి ఇంటి నుండి రోజూ మంచి నీటి కోసం 10రూపాయలు ఖర్చు. మిషన్ భగీరథ ప్రయత్నం అటక ఎక్కింది. బి.ఆర్.ఎస్ పార్టీ మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాక చెప్పిన వాగ్దానం ప్రతి ఇంటికి మంచినీరు 2019 ఎలక్షన్ కి ముందు ప్రతి ఇంటికి చేర్చకుంటే అసలు ఓటు అడగం అని భీరాలు పోయిన ముఖ్యమంత్రి. ఇది కూడా అడగకుండా చావచచ్చి బ్రతుకు బతుకుతున్నాం. నాటి అవేశం ఉత్తేజం మత్తులో కొట్టుకుపోయింది. నా తెలంగాణ పల్లెల్లో ఈ రోజు క్రీడా పండుగ చేస్తున్నారు అట ఆహ్వానం అందింది. గ్రామ కార్యదర్శి కలిసినప్పుడు అడిగా క్రీడలు ఆడుకొనే స్థలం కేటాయించి అందులో ఆడుకోవడానికి ఆట వస్తువులు లేకపోతే క్రీడా పండుగ ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని? క్రీడా, విద్యా వ్యవస్థను సర్వ నాశనం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర పాలక ప్రభుత్వం. ఊరిలో ఉన్న పేద (పెద్ద) బడిలో గ్రౌండ్ ఉన్నా పి.ఈ.టి మాస్టర్ లేడు. ఇక ప్రైవేట్ బడుల గురించి చెప్పనవసరం లేదు. రాంక్ తప్ప వేరే ఆలోచన లేదు. 90వ దశకంలో ప్రైవేట్ అయినా, ప్రభుత్వ పాఠశాల అయినా పి.ఈ.టి తప్పనిసరిగా ఉండేవారు. ఏడ పోతుంది నా రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన. అంతా తిరోగమనమే. అయినా ప్రశ్నించే హక్కు ఉండి కూడా చావచచ్చి బ్రతుకుతున్నమ్. మార్పు కోసం మనవంతు ప్రయత్నం తప్పు జరిగితే ప్రశ్నించడం మన ప్రథమ హక్కు అది గుర్తుచేస్తున్నా అంతే అని తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు.