రైల్వే హాస్పిటల్ ఘటనపై విచారణ చేపట్టాలి

గుంతకల్లు నియోజకవర్గం జనసేన నాయకులు అరికేరి జీవన్ కుమార్

గుంతకల్: గుంతకల్లు రైల్వే డిఆర్ఎం ఆఫీస్ నందు డిఆర్ఎం అందుబాటులో లేనందున, పి.ఎస్ నుండి డిఆర్ఎం ను కలిసి రైల్వే హాస్పిటల్ లో జరిగిన సంఘటనల్ని గుంతకల్లు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు అరికేరి జీవన్ కుమార్ ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళారు. వివరలలోనికి వెళితే వారం రోజుల క్రితం గుంతకల్లు పట్టణమునకు చెందిన మహిళ రైల్వే హాస్పిటల్ లో చేరింది. కాగా, ఆ మహిళను పరీక్షించిన వైద్యులు, ఆమెకు గర్భసంచి ఆపరేషన్ చేసి గర్భసంచిని తొలగించాలి అన్ని చెప్పడం జరిగింది. గర్భసంచి తొలగించే ఆపరేషన్ సమయంలో మూత్ర విసర్జన నాళాన్ని కట్ చేశారు. ఫలితంగా ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో చేతులెత్తేసిన వైద్యులు ఆమెను హుటాహుటిన కర్నూల్ లోని ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ కు పంపించేశారు. ఘటనపై మెడికల్ సూపరింటండెంట్ గజలక్ష్మి ప్రభావతి, ఎటువంటి స్పందన ఇవ్వకపొగ నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది. మే 8వ తేదీన కూడా.. ఇలాంటి సంఘటన జరిగి ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం జరిగినది. ఆ ఘటన మరవకముందే మరోసారి ఇలా జరగడం ఆ వైద్యుడి/వైద్యురాలుపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సంఘటన కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే జరిగింది. ఈ నిర్లక్ష్యానికి కారణం అయిన వైద్యుడు/వైద్యురాలు గజలక్ష్మి ప్రభావతి గారిని వెంటనే విధులు నుంచి తొలగించి, విచారణ జరిపి, వాళ్లపై కఠిచర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మరియు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గుంతకల్లు నియోజకవర్గం, జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేసారు. అంతేగాక గుంతకల్లు రైల్వే హాస్పిటల్ నందు వెంటనే బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి. మరియు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. లేని యెడల పార్టీ తరపున పోరాటం చేస్తాం అన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అనంతపూర్ జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు అమీన్ సొహైల్ , 1వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి హెన్రీ పాల్, గుంతకల్లు నియోజకవర్గం మైనారిటీ నాయకులు షేక్ జీలన్ బాషా, యువ నాయకులు అరవింద్ కుమార్, ఆఋ సి సురేష్ కుమార్, జనసైనికులు చిన్న, ఈశ్వర్, సుభాష్ చంద్రబోస్, చరణ్ సాయి తదితరులు పాల్గొన్నారు.