బడుగు రైతులపై అధికారుల దాడిని ఖండించిన తాతంశెట్టి నాగేంద్ర

రైల్వే కోడూరు: ఉమ్మడి కడప జిల్లా, ఓబులవారి పల్లి మండలం, పెద్ద ఓరంపాడు రెవెన్యూ విలేజ్ లో పేద రైతుల మీద పెత్తందారీ ఆదేశంతో అధికారులు భౌతికంగా దాడిచేసి మరీ పశువుల కోసం నిర్మించుకున్న షెడ్డును కూల దోయాడాన్ని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర తీవ్రంగా ఖండించారు. ఇదే గ్రామంలో దాదాపు 300 ఎకరాలు భూమి అన్యాక్రాంతం అయినా వాటికి ఇసుమంత కూడా లేని చర్యలు పేద రైతులు నిర్మించుకున్న మేకల, పశువులు దొడ్లు కూల్చడం అన్యాయమన్నారు. బాధిత రైతులు ఆలం సిద్దయ్య, ఆలం శివయ్య, శ్రీనివాసులు బోరుమని విలపిస్తూ కోర్టుకు వెళ్ళమని తెలిపినా అధికారులు పెడచెవిన పెట్టడం శోచనీయం. పేదలు తమ కార్యాలయాలు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా స్పందించని అధికారులు మండల రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు, డివిజనల్ ఇంజనీర్ స్థాయి అధికారులు హుట హుటిన అమాయకుల మీద ఎందుకు చర్యకు ఎందుకు ఉపక్రమిస్తున్నారో, అధికారుల వెనుక ఎవరున్నారో, ఎవరి కోసం ఈ పని చేసారో, మండలంలో బడా బాబుల, నేతల, కబ్జాలు అన్ని ఇలా కూలదోసే సత్తా ఉందా అని ప్రశ్నించారు.. పేద రైతులకు అండగా న్యాయ పోరాటం చేస్తామని నాగేంద్ర తెలిపారు.