ముద్రగడపై మండిపడిన వెంగళదాసు దానయ్య

ఆచంట: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాసిన లేఖపై స్పందించిన పశ్చిమగోదావరి జిల్లా జనసేన ఉపాధ్యక్షులు వెంగళదాసు దానయ్య మాట్లాడుతూ.. ఇప్పటివరకు ముద్రగడ వివాదరహితుడని, ఆయన అంటే ఒక గౌరవం ఉండేది కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ అవినీతి చక్రవర్తి అని, ఆయన వద్ద కాపు సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టాలని చూస్తోన్న వారిలో ముదగ్రడ కూడా కలిసిపోయారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ నీతిమంతుడని, బడుగు- బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తోన్నాడని హరిరామ అన్నారు. జనసేన పేరుతో సొంత రాజకీయ పార్టీని పెట్టి, సొంతంగా డబ్బులను ఖర్చు పెట్టుకుంటూ కాపులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీల సహకారంతో పోరాటం చేస్తోన్న పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అభాండాలు వేయడం సరికాదని అన్నారు. కాపు కులస్తులకు పుట్టినవాడు ఎవడైనా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడతాడా?.. అని ముద్రగడను నిలదీశారు. తెలుగుదేశంతో గానీ, బీజేపీతో గానీ పొత్తు లేదని పవన్ కళ్యాణ్ ఏనాడూ ప్రకటించలేదని, పొత్తులు ఉన్నా తానే ముఖ్యమంత్రినని చెప్పుకోవడం సంతోషకరమని అన్నారు. పవన్‌పై చేస్తోన్న అభియోగాలన్నీ రాజకీయ లబ్ది కోసం ముద్రగడ ఇలా దిగజారడం సరికాదని చెప్పారు. నోరు మూసుకుని కూర్చుంటే అందరూ సంతోషిస్తారంటూ వెంగళదాసు దానయ్య హెచ్చరించారు.