జైలుకి జంకం, కేసులకి భయపడం

శ్రీకాళహస్తి నియోజకవర్గం: ఈ వైసీపీ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి వినుత కోటా గారి భర్త జనసేన పార్టీ నాయకులు శ్రీ కోటా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడమే కాక. పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును కోరుతూ దొంగ నాటకాలు చేస్తున్నారు. జైలుకి పంపినంత మాత్రాన భయపడతాము అనుకోవడం, వెనకడుగు వేస్తాం అనుకోవడం ఈ వైసిపి మూర్ఖత్వం. జైలుకి జంకం, కేసులకి భయపడం మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం మా పోరాటం రెట్టింపుగా చేస్తాం తప్ప తగ్గే ప్రసక్తి లేదని జనసేన పార్టీ తరఫున తెలియజేయడం జరిగినది.