రాపాక గ్రామంలో జనంలోకి జనసేన.. జనం కోసం జనసేన

తణుకు నియోజకవర్గం: ఇరగవరం మండలం, రాపాక గ్రామంలో జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు ఆధ్వర్యంలో జనంలోకి జనసేన.. జనం కోసం జనసేన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను, ఆశయాలను రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలను తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో విడివాడ రామచంద్రరావు మాట్లాడుతూ.. ఇరగవరం మండలం, రాపాక గ్రామంలో సుమారు 2000 మంది జనాభా కలిగిన ఊరు అని ఎన్నో ఏళ్లుగా నరసాపురం కాలువ వంతెన నడకదారి వచ్చే వంతెన తప్ప ఆటోలు కార్లు వెళ్లే విధంగా లేకపోవడం కనీసం ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్లు ఫైర్ ఇంజన్ ను వచ్చే అవకాశంలేని వంతెనని ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం స్పందించి వంతెనను నూతన నిర్మాణం చేయాలని విడివాడ రామచంద్రరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరగవరం మండలం పార్టీ అధ్యక్షులు ఆకెట్ కాశి, రాపాక జనసేన పార్టీ నాయకులు గ్రంధి చరణ్, నండూరి పవన్, కోటిపల్లి నాగేంద్రబాబు, సలాది అనిల్, ముత్యాల రాజేష్, బృందావనం పవన్ కళ్యాణ్, తణుకు మండల అధ్యక్షులు చిక్కాల వేణు, తూర్పు విప్పర్ జనసేన పార్టీ ఉపసర్పంచ్ ఆకుల చిన్న, నాగేశ్వరరావు, కే కుములవల్లి, పిండి గోవింద్, తణుకు టౌన్ ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ, మరియు జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.