సర్వేపల్లిలో జనం కోసం జనసేన 23వరోజు

సర్వేపల్లి నియోజకవర్గం: పొదలకూరు మండలం నందు అదివారం జనం కోసం జనసేన 23వరోజు కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిర్వహించారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. ఎ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ అభివృద్ధి లేని సర్వేపల్లి నియోజకవర్గం అస్తవ్యస్తమైన రోడ్లు, పొదలకూరు నుండి కాకివాయి, నేదురుపల్లి, అయ్యవారిపాలెం, అమ్మవారిపాలెం మీదుగా ఆరు గ్రామాలకు వెళ్లే రోడ్డు 23 కిలోమీటర్లు అస్తవ్యస్తంగా మారి ఒక గొయ్య, మురకి, ఒక గుంట అన్నట్టుగా రోడ్డుంది. అయితే ఆ చుట్టుపక్కల 6 గ్రామాల ప్రజలు ప్రతిరోజు పొదలకూరు టౌన్ కి రాకపోకలుగా వెళ్లేటువంటి పరిస్థితి. వైద్యం నిమిత్తం కావచ్చు, నిమ్మకాయలు తీసుకువెళ్లి అమ్ముకోవడం కోసం కావచ్చు. అనేక విధాలుగా నిత్యం పొదలకూరుకు వెళ్లే పరిస్థితి. అయితే బైకులు కావచ్చు, ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, ఈ గుంటల్లో పడి పోయే పరిస్థితి, డ్రైవింగ్ చేసే వాళ్లకి భుజాల నొప్పులు వచ్చి నడుములు పోయి, ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితి. ప్రజల సమస్యలు, ఇబ్బందులు వైసీపీ ప్రభుత్వానికి పట్టడం లేదు. వీళ్ళకి కావాల్సినదల్లా ఎన్నికల సమయంలో కల్లబోల్లి మాటలు చెప్పి, ఒక కోటర్ మందు, ఒక బిర్యానీ ప్యాకెట్, రూ.1000 నుంచి 2000 వరకు నగదు పంపిణీ చేసి ఎన్నికల్లో గెలుచుకోవడం. ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళు దోచుకోవడం, దాచుకోవడం, కూల్చడం, ముంచడం, బూతులు మాట్లాడడం తప్ప ఇప్పటివరకు రాష్ట్రంలో కావచ్చు, సర్వేపల్లి నియోజకవర్గంలో కావచ్చు ఎక్కడ కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ప్రజలు కూడా కల్లబొల్లి మాటలు చెప్పే వైసిపి ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఒక్క క్షణం ఆలోచించండి ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం. ప్రజలే పాలకులుగా పరిపాలన కొనసాగించుకుందాం. మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాం. రాబోయేది జనసేన ప్రభుత్వం, కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ప్రజలందరూ ఒక క్షణం ఆలోచించండి. రాబోయే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.
ఈ కార్యక్రమంలో వెంకటాచల మండల నాయకులు ఖాజా, పొదలకూరు మండల నాయకులు సంజు, పవన్, కళ్యాణ్, జాన్, ప్రసాద్, కార్తీక్, శశి, పెంచలయ్య, వంశి, అశోక్, గోపి తదితరులు పాల్గొన్నారు.