పవనన్న యువత ఆధ్వర్యంలో పవనన్న చేనేత బాట 365 రోజుల ప్రస్థానం

చీరాల, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి చేనేత వృత్తుల అన్నా చేనేత కళాకారుల అన్నా ప్రత్యేకమైన అభిప్రాయం గౌరవం ఉన్న సంగతి మనకు తెలిసిందే. చేనేత కళాకారులకు గుర్తింపు తీసుకురావాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం అనేది మనం ప్రత్యేకంగా ప్రస్తావించవచ్చు. దీనివలన ఎక్కువ మంది చేనేత వస్త్రాలు ధరించడం వలన డిమాండ్ పెరిగితే, చేనేత వృత్తులకు డిమాండ్ పెరిగితే చేనేత కళాకారులకు ఆర్థిక భరోసా కలుగుతుంది అని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఎంతో ఉన్నతంగా ఆలోచన చేస్తూ ఈనాటికి కూడా చేనేత వస్త్రాలు ధరిస్తూ ఎంతో మందికి స్పూర్తిదాయకంగా ఉంటున్నారు. ఇటువంటి చేనేత కళాకారులు ఎదుర్కొంటున్న వంటి సమస్యలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి కర్ణ కిరణ్ తేజ, ఆర్.కె నాయుడు ఇద్దరు కలిసి ఒక ప్రత్యేకమైన కార్యాచరణతో చేనేత కళాకారుల కుటుంబాల దగ్గరకి వెళ్ళినప్పుడు ఏ ఏ సమస్యల మీద సమాచారాన్ని తీసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సర్వే పేపర్ను తయారుచేసి(డిజైన్) కార్యక్రమానికి “పవనన్నచేనేత బాట” అనే పేరునీ డిజైన్ చేసి అందుబాటులో ఉన్న జనసేన యువతతో  ఈ కార్యక్రమాన్ని 2022 జూన్ 25వ తారీఖున మొదలుపెట్టడం జరిగింది. కార్యక్రమం మొదలుపెట్టిన రోజున నలుగురు తో ప్రారంభమై రోజు రోజుకి నియోజకవర్గంలో అందుబాటులో ఉండి అండర్ గ్రౌండ్ లో ఉన్న ప్రతి జనసైనికుడు ఈ కార్యక్రమంలోకి భాగస్వామి అయ్యే విధంగా చేసినది. అలానే ప్రతి జనసైనికుడిని కదిలించడం జరిగింది.

ఈ కార్యక్రమం ఎలా సాగింది అంటే పవనన్న యువతగా కొంతమంది టీంగా తయారయ్యి చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి చేనేత కళాకారుని కుటుంబానికి వెళ్లి పది నుంచి పదిహేను నిమిషాల పాటు సమయాన్ని వెచ్చించి పరామర్శిస్తూ వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలన్నీ సంకలనం చేయడం జరిగింది. రాబోయే జనసేన ప్రభుత్వంలో చేనేత కళాకారులకు ఏ రకమైన పథకాలు తీసుకొస్తే ఆర్థికంగా బలపడతారో ఆ పధకాలు ప్రవేశపెట్టడానికి  పవనన్న చేనేత బాట అనే కార్యక్రమాన్ని జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు యొక్క ఆదేశాలతో, ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ సూచనలతో మొదలుపెట్టిన రోజు నుంచి 160 రోజులు పాటు నిరంతరంగా కొనసాగించడం జరిగింది. ఒక నియోజకవర్గానికి ఇన్చార్జి లేకుండా ఒక కార్యక్రమాన్ని నిరంతరంగా 160 రోజులు చేసినటువంటి చరిత్ర ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి పవనన్న యువతదే.

ఈ కార్యక్రమంలో భాగంగా పవనన్న చేనేత బాట టీమ్ చీరాల నియోజకవర్గంలో ఉన్న రెండు మండలాలలో 4000 చేనేత కుటుంబాల ఇంటికి దగ్గరకు వెళ్లి ఆ సమస్యలను సంకలనం చేయడం జరిగింది. సంకలనం చేసినటువంటి సమాచారాన్ని డాక్యుమెంట్ రూపంలో చిల్లపల్లి శ్రీనివాసరావుకి, నాదెండ్ల  మనోహర్ కి కూడా అందజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఒక ప్రత్యేక డాక్యుమెంట్ని పవన్ కళ్యాణ్ గారికి అందజేయాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం కొనసాగిస్తూ చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి ఈ పవనన్న యువత పవనన్న చేనేత బాట కార్యక్రమం ద్వారా కృషి చేస్తున్నది. ఇప్పటివరకు చీరాల నియోజకవర్గంలో సగం చేనేత కుటుంబాలను ఇంటింటికి పలకరించడం జరిగింది. అలానే చేనేత కుటుంబానికి పక్కగా ఉన్నటువంటి వేరే కుటుంబ సభ్యులకు కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు మేనిఫెస్టో పత్రాన్ని పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమం 365 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ చేనేత వికాస విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పవనన్న యువత పవనన్న చేనేత బాట టీమ్ ని మంగళగిరి కార్యాలయానికి ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత గొప్ప స్ఫూర్తితో జరగటానికి వెన్నుంటి నిలబడి ప్రోతహించిన జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ లకు, చేనేత విభాగం తరపున ఎల్లవేళలా సహకారం అందించిన చేనేత వికాస విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, ప్రత్యేక సందర్భాలలో ఆర్థిక సహకారం అందించిన ఎన్నారై పింజల విజయ్ కుమార్, రాం సత్యవతి, మెట్టు మంగా దేవిలకు ప్రత్యేక ధన్యవాదాలు. 
 
ఈ కార్యక్రమం జరుగుతున్న వివిధ రోజులలో కార్యక్రమంలో భాగస్వాములై జనసైనికులలో స్ఫూర్తి నింపినటువంటి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, జిల్లా కార్యదర్శి చనపతి రాంబాబు, జిల్లా కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, జిల్లా కార్యదర్శి రాయని రమేష్, ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శి గోవింద్ కోమలి, ఒంగోలు నగర కార్యదర్శి ఆకుపాటి ఉష, ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శి సుంకర కళ్యాణి ప్రత్యేక ధన్యవాదాలు.

చేనేత వికాస విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చేనేతలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒక రోజు పైలెట్ సర్వే చేయమని ఆదేశించిన సందర్భంలో క్షేత్రస్థాయిలో సహకరించిన పర్చూరు నియోజకవర్గ మార్టూరు మండల అధ్యక్షులు మందపాటి కిషోర్, ప్రధాన కార్యదర్శి గోలి సురేష్, అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి కంచర్ల శ్రీకృష్ణ, కార్యదర్శి సురేష్, జే పంగులూరు మండల అధ్యక్షులు కసుకుర్తి వీర హనుమాన్, కనిగిరి నియోజకవర్గం పెద్ద చర్లపల్లి మండల అధ్యక్షులు బండారు రాజు, కనిగిరి మండల ఉపాధ్యక్షులు ఇండ్ల రమేష్, మండల ప్రధాన కార్యదర్శి బాల కేశవ్, ఒంగోలు నియోజకవర్గ కొత్తపట్నం మండల అధ్యక్షులు నున్నా జానకిరామ్, ఉపాధ్యక్షులు మహాదేవ్, జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార విభాగ కార్యదర్శి పోకిం గారి రాజు, ఈతముక్కల గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు వినోద్, సంతనూతలపాడు నియోజకవర్గ సీమకుర్తి మండల అధ్యక్షులు పల్లపు శివప్రసాద్, దర్శి నియోజకవర్గ పర్యటనలో భాగంగా మార్గం మధ్యలో ఆత్మీయతతో తేనీరు అందించిన తాళ్లూరు మండల చేనేత కళాకారుడు కోటేశ్వరరావు, దర్శి నియోజకవర్గ ఇన్చార్జి బోటుకు రమేష్, కురిచేడు మండల అధ్యక్షులు మాదా శేషయ్య, ఉపాధ్యక్షులు మంచాల నరసింహనాయుడు, గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి బెల్లంకొండ సాయిబాబు, జిల్లా కార్యదర్శి లంక నరసింహారావు, కంభం మండల అధ్యక్షులు వెంకట ప్రసాద్, బెస్తవారిపేట మండల అధ్యక్షులు పివి సాయి “పవనన్న యువత పవనన్న చేనేత బాట” తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.

పవనన్న చేనేత బాట మొదలయ్యి 365 రోజుల పాటు కొనసాగడానికి సహకరించిన టీమ్ సభ్యులైన పింజల నాగరాజు, నాగుర్ వలి, పల్లపోలు పవన్ కుమార్ నాయుడు, భూపతి మనోజ్ కుమార్, వరం బూడిద, పింజల సంతోష్, పసుపులేటి సాయి, దోగుపత్తి లలిత్ కుమార్, గుత్తి సదాశివరావు, పృద్వి శ్రీహరి, బుద్ధి శ్రీహర్ష, చింతా కళ్యాణ్, వేటపాలెం చరణ్, గొర్ల రఘురాం, ఆలా శ్రీధర్(వెంకటేశ్వరరావు), చల్లా సురేష్, తోట రాజ్ కుమార్, షేక్ బాషా,కట్టా వినయ్ కుమార్, కె సిద్దు, కొణిజేటి నగర్ సైనికులు కొంపల హరీష్, పాలపర్తి హరికృష్ణ, కసుకుర్తి వినయ్, చేనేతపూరి సైనికులు బట్టు బాలాజీ, సాంబశివ, పార్థ సారధి, మాధవ్, భార్గవ్, గౌతమ్, రావూరిపేట సైనికులు వినోద్, భాను, చల్లా వెంకట రాజ సాయి, పందిళ్ళపల్లి జనసైనికులు ముంగర రాజా, కరీం సాయి, గంటా సూర్య తేజ, చీయమని నారాయణ, పముజల బాల, పృద్వి పూర్ణ, చెరుకూరి సుధాకర్, చెరుకూరి చిన్ని, సాయి కళ్యాణ్, పిట్టు వెంకటేష్ రెడ్డి, చెరుకూరి గణేష్, పసుపులేటి భార్గవ్, పల్లపాటి శ్రీనివాస్, నున్నా భార్గవ్, వేటపాలెం జనసైనికులు కిషోర్, రేకుల వెంకటేష్, చుండూరు గోపి, చుండూరి శ్రీనాథ్, కాకుమాను వెంకట భూపేంద్ర, వీరాంజనేయులు, అనీల్ కృష్ణ, అనుమల్లి పేట జనసైనికులు బొడ్డు వెంకటేష్, గుత్తి తేజ, గుత్తి అజయ్ కుమార్, గుత్తి గణేష్, గుత్తి విజయ్, కర్రి వెంకటేష్, బండారు రమేష్, కర్ణ ప్రసాద్, నీలకంఠాపురం జనసైనికులు పింజల దేవి వరప్రసాద్, ఆమోదగిరిపట్నం జనసైనికులు మాచర్ల నవీన్, వరుణ్, జాండ్రపేట జనసైనికులు యశ్వంత్, మోహన్ కృష్ణ, కళ్యాణ్, కళ్యాణ్, లక్ష్మీ నగర్ సిద్దుర్ కాలనీ జనసైనికులు కండరాపు సాయి, దరదా సాయి, జె అశోక్, ఉప్పు పుల్లారావు, గుత్తి హేమంత్, పెరెన్నేటి తులసి, హస్తినాపురం జనసైనికులు హస్తినాపురం జనసైనికులు శివరాత్రి రాము, గుంజి పూర్ణ, చీరాల వైకుంఠ పురం జనసైనికులు వావిలపల్లి రవి, లంక భార్గవ్, గుంటూరు యువరాజ్, వద్ధి తేజ, పాముజుల బాలవెంకట సుబ్బారావు, కొత్తపేట సైనికులు బత్తిన బాలాజీ, సోమిసెట్టీ కిరణ్, ఈపురుపాలెం జనసైనికులు గోలి తిరుమల వెంకటేష్, అయ్యప్ప నాయుడు, బండారు(వీవెర్స్) కాలనీ జనసైనికులు జి.ఉదయ్ సాయి, పడవల యశ్వంత్, జి జగదీష్, పి నాగార్జున, జి శ్రీను, టి.బాలరాజు, ఎస్ జయంత్, ఎన్ సుభాష్, కె.నాగ, డి.వెంకట భార్గవ్, ఎం వెంకట్, పవన్, కె.నరేంద్ర, జి గోపి, డి.రాము, రమేష్, పవన్, ఉప్పుగుండూరు జనసైనికులు వంశీ, భరత్, సాయి, పర్చూరు నియోజకవర్గ చిన్నగంజాం మండల ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి హరిబాబుకి మరియు పర్చూరు నియోజకవర్గ జనసేన యువ నాయకులు తోట అశోక్ చక్రవర్తి, వివిధ సందర్భాల్లో జనసేన పార్టీ కార్యక్రమాలకు అవసరమైన ఫ్లెక్సీలను, పోస్టర్లను ప్రత్యేక దృష్టితో డిజైన్ చేసి ఇచ్చినటువంటి అమరావతి డిజిటల్స్ – వేటపాలెం యజమాని మలబంటి నాగేంద్ర బాబుకి, మలబంటి వెంకటేష్ కు మరియు చీరాల నియోజకవర్గంలో ఉన్న చేనేత కళాకారుల కుటుంబాలకు, జనసైనికులకు జనసేన పార్టీ చీరాల నియోజకవర్గ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు.