సి.ఎస్.ఐ చర్చ్ నిర్మాణానికి యడ్లపల్లి రామ్ సుధీర్ టైల్స్ అందచేత

పెడన నియోజకవర్గం, పెడన మండలం నందిగామ దళితవాడలోని (సి.ఎస్.ఐ) చర్చ్ శిథిలావస్థకు చేరడంతో దాని స్ధానంలో గ్రామస్తులు నూతనంగా చర్చ్ భవనాన్ని నిర్మించుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం వారి గ్రామంలో పెడన నియోజకవర్గం జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ పర్యటిస్తూ ఉండగా మహిళలు, గ్రామస్తులు అంతా వచ్చి యడ్లపల్లి రామ్ సుధీర్ గారిని కలిసి మేము దేవుని మందిరం నిర్మించుకుంటున్నాము అయ్యా మా చర్చ్ కు మీరు ఫ్లోర్ టైల్స్ సహాయం చేయండి అని అడిగారు.. వెంటనే యడ్లపల్లి రామ్ సుధీర్ స్పందించి తప్పకుండా అడిగిన ఫ్లోర్ టైల్స్ పంపుతాను అని వారికి హామీ ఇవ్వడం జరిగింది. చర్చ్ నిర్మాణం పూర్తి దశకు చేరుకోవడంతో యడ్లపల్లి రామ్ సుధీర్ గ్రామస్థులకు ఇచ్చిన హామీ మేరకు ఫ్లోర్ టైల్స్ మొత్తాన్ని పంపారు. వాటిని జనసేన నాయకులు నందిగామ దళితవాడలోని (సి. ఎస్. ఐ) చర్చ్ వద్ద చర్చ్ పెద్దలు, సభ్యులు మరియు గ్రామస్థులకు ఫ్లోర్ టైల్స్ ను అందచేసారు. ఈ సంధర్భంగా గ్రామంలోని మహిళలు దేవుని మందిరానికి అడిగిన వెంటనే రామ్ సుధీర్ గారు మాకు సాయం చేశారు. అయన చల్లగా ఉండాలి, ఆ దేవుడు ఆయనను ఆశీర్వదిస్తాడు.. మా అందరి తరపున జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అంటూ హర్షం వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోలగానీ లక్ష్మీ నారాయణ, క్రోవి సుందర రాజు, సింగంశెట్టి అశోక్ కుమార్, యర్రంశెట్టి రామాంజనేయులు, క్రోవి కొండలరావు, కొఠారి మల్లి బాబు, కిరణ్, శివ, బాకీ నాని, పవన్, గ్రామస్థులు మెండ లక్ష్మీ కాంతం, ఇమ్మానుయేలు, బొడ్డు సుబ్బారావు, బొడ్డు ఆశీర్వాదం, బొడ్డు (చిన్న) అమలేశ్వర రావు, బొడ్డు యాకోబు, మెండు కిరణ్, బొడ్డు వరలక్ష్మి, బొడ్డు కృపా భాయమ్మ, బొడ్డు కుమారి, బొడ్డు సలోని, బి.వరలక్ష్మి, దోమతోటి సుమతి, బొడ్డు చిన యేసు దాసు, బొడ్డు సుధాకర్, బొడ్డు వర్ధన రావు, బొడ్డు చెంచులు, బొడ్డు రమణ, బొడ్డు నాంచారమ్మ పాల్గొన్నారు.