వారాహి యాత్రకు వస్తున్న స్పందనకు ఓర్వలేక.. జనసేనానిని విమర్శిస్తున్న ఆళ్ళనాని

  • వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆంధ్ర రాష్ట్రంలో అత్యాచారాలు పెరుగుతున్నాయి
  • పోలీసు వ్యవస్థ విఫలమైంది
  • పట్టపగలు నడిరోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి
  • ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లూటీలకు పాల్పడుతున్నారు
  • అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారు
  • వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది
  • సరైన రోడ్డు వ్యవస్థ డ్రైనేజీ నిర్మాణం లేదు
  • అధికార నాయకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు
  • పశ్చిమ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు ఆరోపణలు..

ఏలూరు నియోజకవర్గం: ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ.. నరసాపురం సభ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం అయింది. ఆ సందర్భంలో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండలను వ్యవస్థల్ని నిర్వీర్యం పరుస్తూ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనిమీద మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఏలూరు శాసనసభ్యుడు ఆళ్ల నాని గారికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న ఒత్తుడులు వస్తున్నాయి. అది తట్టుకోలేక మంగళవారం వారు ప్రెస్ మీట్ పెట్టారు.. అమాయకత్వమైన శాసనసభ్యులు ఆళ్ళనాని గారిని అడుగుతున్నాం.. వ్యవస్థలు ఏమి విఫలమైందని ప్రశ్నిస్తున్నాం.. జగన్మోహన్ రెడ్డి కన్నా చాలా సీనియర్ అయిన శాసనసభ్యుడుగా చాలా ఉన్నతమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పని చేసిన మీ కళ్ళకు కనపడటం లేదా??. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయింది. ఈ రోజు ప్రధానంగా మీరు చేసిన ఈ వైద్య ఆరోగ్యశాఖ పూర్తిగా విఫలమైంది. ఇక్కడ వైద్యం అందని పరిస్థితి కనిపిస్తుంది. ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి పాత బిల్డింగులకి రంగులేసి మీరు ఆర్భాటం చేస్తున్నారు. జనరల్ పేషెంట్లకి అడ్మిషన్ లేదు. ఇతర ఆస్పత్రికి తరలించడం జరిగుతుంది ఈ పరిస్థితిని ఇక్కడ చూస్తునే ఉన్నాం. ఈ రోజున ఏదైతే వ్యవసాయ కేంద్రాలు ఉన్నాయో రైతులకు సకాలంలో డబ్బులు అందడం లేదు.. వాళ్ల దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. అనేక రకాల సాకులు చెప్పి వాళ్ళని మోసం చేస్తున్నారు. ఏలూరులో డ్రైనేజీ వ్యవస్థ చాలా తీవ్రంగా ఉంది. మీ దగ్గర ఉన్న ఏకైక వ్యవస్థ వాలంటరీ. వాలంటరీ వ్యవస్థ మాత్రమే పని చేస్తుంది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఢిల్లీలో కూర్చొని వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ఇవన్నీ మీకు కనిపించడం లేదా??. ఈ రోజు స్థానిక పంచాయతీ సర్పంచులు విచారణ చేస్తున్నారు. మీ కళ్ళకు కనిపించడం లేదా??. వ్యవస్థలు అన్ని విఫలమవుతూనే ఉన్నాయి. మీకు కనిపించడం లేదా??. మండల వ్యవస్థలు, జిల్లా వ్యవస్థలు విఫలమైంది. మీ దుర్మార్గమైన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనేక రకాల లూటీలు చేయడం లేదా అని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ఎక్కడపడితే అక్కడ ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. పోలీసు వ్యవస్థ విఫలమైంది. పోలీసు వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. పట్టపగలు నడిరోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి. బురఖాలు వేసుకుని వచ్చి మరీ హత్యలు చేస్తున్నారు. ఇవి మీ కళ్ళకు కనిపించడం లేదా?. ఇవన్నీ చూస్తుంటే మీ ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలు విఫలమైనట్టు కాదా?. ఇరిగేషన్ శాఖ ఎక్కడైనా ఉందా?. పోలీసు వ్యవస్థల్ని మీరు జేబులో పెట్టుకున్నారు. ఇతర పార్టీల నాయకులు ప్రజా సంఘాలు ఏవైనా ప్రశ్నిస్తే వాళ్లను నిర్బంధించి కేసు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా?. ప్రజాస్వామ్యం వ్యవస్థని ఖూనీ చేస్తున్నారు. డా.బి.ఆర్. అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి కాలరాస్తున్నారు. ఇతర ఏ యొక్క వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ లో జీవించే స్వేచ్ఛ లేదు. ఎక్కడా ఒక ఇండస్ట్రీ లేదు. రాష్ట్రంలో ఉభయగోదావరి జిల్లాలో ఉన్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో మీరు దోచుకుంటున్నారు. ఈ రోజు మైనింగ్ డిపార్ట్మెంట్ గుర్తుకు రావడం లేదా? ఆ శాఖలు ఎక్కడైనా పని చేస్తున్నాయా?. ఇలాంటివన్నీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారు, ప్రశ్నిస్తూనే ఉంటారు.. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెబుతున్నారు రాజకీయ నాయకుడిగా ఉండి తప్పు చేస్తే మమ్మల్ని ప్రశ్నించండి. వ్యవస్థ విఫలమవుతోంది.. ఇలాంటివన్నీ సరి చేయాలంటే ప్రజలు చైతన్యం కావాలి. ప్రజల్లో ప్రశ్నించే తత్వం రావాలి. ఏ రాజకీయ నాయకుడైనా. ఏ ప్రభుత్వమైనా ఆఖరికి నన్నైనా గాని ప్రశ్నించండి. అందరి ముందు నిలబెట్టండి. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది.
చట్టపరంగా చట్టం మీద ప్రమాణం చేసిన మీ వైసీపీ మంత్రులు గానీ, ఎమ్మెల్యే గానీ, కొంతమంది ఎంపీలు గానీ అసభ్యకరమైనటువంటి పదజాలాలతో బూతుల పురాణం తీసుకొచ్చింది. మీ నాయకులు మీ పార్టీ వాళ్లు కాదా?? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు. వ్యవస్థలు విఫలమైంది. దీన్ని సరి చేయాల్సిన బాధ్యత ప్రజలపై ప్రభుత్వంపై ఉంది. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోని ఆరోపణలు అవాకులు, చవాకులు పేల్చితే చూస్తూ ఊరుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, నగర కార్యదర్శులు కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, బుధ్ధా నాగేశ్వరరావు, జనపరెడ్డి, తేజ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.‌