పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత మీకు లేదు!

  • ఆచంట ఎమ్మెల్యేకు దీటుగా సమాధానం ఇచ్చిన పెనుగొండ మండలం జనసేన ప్రధాన కార్యదర్శి మంద నవీన్

ఆచంట నియోజకవర్గం: ఆచంట ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలకు పెనుగొండ మండలం జనసేన ప్రధాన కార్యదర్శి మంద నవీన్ దీటుగా సమాధానం ఇచ్చారు. బుధవారం మీడియా ముఖంగా నవీన్ మాట్లాడుతూ.. గౌరవనీయులైన ఆచంట ఎమ్మెల్యే గారికి నమస్కారములు మీరు మా జనసేన అధినేత గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత మీకు లేదండి. మీ సొంత నియోజకవర్గమైన ఉండి నియోజకవర్గంలో పోటీ చేయలేని దుస్థితి మీది. అటువంటి మీరు ఆయన్ని పోటీ చేయమని అడుగుతుంటే నవ్వొస్తుంది. ముందు మీరు ఆచంట నియోజకవర్గంలో రోడ్లు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో వాటి మీద మీద దృష్టి పెడితే బాగుంటుంది. అలాగే మీరు ఇచ్చిన హామీలు స్మశాన వాటికలు, కమిటీ హాల్, గ్రామాల్లో రోడ్లు వాటిని పూర్తి చేస్తే బాగుంటుంది. మీరు అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు కాలం ముగుస్తున్నా ఇంకా కనీస మౌలిక సదుపాయాలు లేవంటే మీ పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలకు అర్థమవుతుంది. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించడం మానేసి నియోజకవర్గం అభివృద్ధి చేస్తే ముందు మీరు ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుందని నవీన్ తెలిపారు.