30 రోజుల్లో కల్వర్టు నిర్మాణం చేపట్టాలి..

  • 45వ డివిజన్ లో కొత్తగా వేసిన కల్వర్టులు కూలిపోతే అధికారులు కాలయాపన చేస్తున్నారు
  • లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తాము
  • హెచ్చరించిన పశ్చిమ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 45వ డివిజన్ సంబంధించినటువంటి వంతెన కూలిపోతే కొత్త వంతెన వేశారు. అదేవిధంగా సుదీర్ఘకాలంగా ఇక్కడ రెండు కల్వర్టులు ఉన్నాయి. కనెక్టింగ్ రోడ్లు, కనెక్టింగ్ వంతెనలు ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు కార్పొరేటర్ గా చేసి కౌన్సిలర్ గా చేసినటువంటి గంగాధరరావు గానీ లేదా గవ్వ నారాయణ రావు గాని, అంతకుముందు అస్లాం పాషా అందరూ కూడా ఈ యొక్క ఏరియాలో ఈ యొక్క మురుకుతూముకు వెళ్ళే కొల్లేటిలో కలిసేటువంటి మురుకుతూముతో కలిసే మురికి కాలువ.. దీనిపైన రెండు కనెక్టింగ్ కల్వర్టులు ఉన్నాయి. ఈ కొత్త వంతెన నిర్మాణంలో భాగంగా ఈ రెండు కల్వర్టులు కూల్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక సింగల్ రోడ్డు ఏదైతే ఆ వంతెన ఫ్లై ఓవర్ దిగి మళ్లీ అదే రోడ్లో వెళ్లేటువంటి పరిస్థితి. ఈ స్థితిపై స్పందించిన పశ్చిమ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు స్పందిస్తూ.. ఈ రోజు మన మున్సిపల్ శాఖ అధికారులు మరి కళ్ళు మూసుకుపోయి ఉన్నటువంటి పాలకవర్గం మేయర్ గారు కళ్ళు మూసుకుని పరిపాలన చేస్తూన్న ఎమ్మెల్యే ఆళ్ళనాని గారు మీరైనా విజిట్ చేసి ఇక్కడ రెండు కన్వర్ట్లు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలకి అటు ఇటు వెళ్ళుటకు గాని పిల్లలు స్కూల్ కు పోవుటకు గాని అన్ని విధాలుగా కూడా ఉపయోగం ఉంటుంది. పెద్ద ఖర్చుతో కూడినటువంటి కల్వర్టు కాదు. ఆల్రెడీ కల్వర్టు ఉంది. చిన్న కనెక్టింగ్ ఇస్తే కల్వర్టు అవుద్ది. కానీ ఈ యొక్క కాంట్రాక్టుకి ఇచ్చినటువంటి అధికారులు ఈ యొక్క రకమైనటువంటి ప్లానింగ్ ఏదీ లేకుండా ప్రజల ఇబ్బంది పడే విధంగా చేస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అనేకమంది ప్రజలు మా దృష్టికి గతంలోనే తీసుకువచ్చారు‌‌. కానీ ఈ ప్రభుత్వంలో డబ్బులు లేవు. ఈ వంతు నిర్మాణం కూడా చాలా కాలం పడుతుంది. ఏలూరులో ఉన్నటువంటి ప్రజలు చుట్టూ తిరిగి రావలసిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని నేను దానిమీద ఎటువంటి కామెంట్ చేయడం లేదు. ఇప్పటికైనా మీరు ఈ విషయంపై స్పందించి ఏలూరు శాసనసభ్యులు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, మేయర్ గారు మరియు 45వ డివిజన్ కార్పొరేటర్ పాషా గారు.. ఈ డివిజన్ లో కార్పొరేటర్ గా రెండోసారి గెలిచారు పాషా గారు.. మరి అక్కడ ప్రజలకి ఉన్నటువంటి ఈ సమస్య కూడా మీరు పట్టించుకొని మీ డివిజన్ నుండి రెండు కల్వర్టులు కూడా నిర్మాణం చేయాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శి బొత్స మధు, కందుకూరి ఈశ్వరరావు, 45వ డివిజన్ ఇంచార్జీ పసుపులేటి దినేష్ తదితరులు పాల్గొన్నారు.